సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన వంగ రాజేశ్వర్ రెడ్డి

  • - ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్
  • - రైతులను ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన

సిద్దిపేట మార్కెట్ యార్డును సందర్శించిన వంగ రాజేశ్వర్ రెడ్డి

సిద్దిపేట:

 సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో పంట కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకుడు వంగ రాజేశ్వర్ రెడ్డి మంగళవారం స్వయంగా మార్కెట్ యార్డును సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
మార్కెట్ యార్డుకు ప్రొద్దుతిరుగుడు, వడ్లు, మొక్కజొన్న పంటలను తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి కొనుగోళ్లు ప్రారంభం కాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కనీసం మార్కెట్ యార్డు గేట్లు కూడా తెరవకపోవడంతో ట్రాక్టర్లు, వాహనాలతో బయటే నిరీక్షించాల్సి వస్తోందని రైతులు వాపోయారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన వంగ రాజేశ్వర్ రెడ్డి రైతులు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు వచ్చినప్పుడు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకున్న ఆయన సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతు పండించిన ప్రతి గింజకు గౌరవం దక్కాలని, రైతు చెమట వృథా కాకూడదని వంగ రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.తమ సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడినందుకు రైతులు వంగ రాజేశ్వర్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.WhatsApp Image 2026-05-26 at 19.30.06

About The Author