ఎన్.టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించినమల్ రెడ్డి రాంరెడ్డి.

ఎన్.టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించినమల్ రెడ్డి రాంరెడ్డి.

వనస్థలిపురం:

తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఎల్బీనగర్ నియోజకవర్గంలో వైభవంగా జరిగాయి. వనస్థలిపురంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉన్న రామారావు విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

*పేదల పాలిట పెన్నిధి ఎన్టీఆర్: మల్ రెడ్డి రాంరెడ్డి,
విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మల్ రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం సుస్థిరమని, ఆయన ఆశయాలు, ఆదర్శాల బాటలో పయనించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత రామారావుదేనని స్పష్టం చేశారు.WhatsApp Image 2026-05-28 at 20.03.49

*తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు:
ఈ కార్యక్రమంలో ఈశ్వరమ్మ, ముదగోని లక్ష్మి ప్రసన్న, వెంకట్ గాంధీ, రాజుబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, రామారావు, గణేష్ నాయక్ పాల్గొన్నారు. అలాగే డివిజన్ అధ్యక్షులు బండ సురేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, కె. శశిధర్ రెడ్డి, కసోజు శ్రీనివాస్, జంగీర్ బాబు గౌడ్, వెంకట్రామ్ రెడ్డి, భుజంగ రెడ్డి, నోముల కృష్ణ గౌడ్, వెనులయ్య గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, యుగంధర్ సహా పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి నివాళులర్పించారు.WhatsApp Image 2026-05-28 at 20.03.50 (1)

About The Author