లక్ష రూపాయల విలువైన ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు:
ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన నోముల నరసింహ గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ఎల్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన లక్ష రూపాయల విలువైన ఎల్ఓసిని బుధవారం సాయంత్రం పటాన్‌చెరు లోని తన కార్యాలయంలో నరసింహ గౌడ్ కుటుంబ సభ్యులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
29 May 2026
