రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదుల నిరసన

రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదుల నిరసన

ఎల్బీనగర్:

మహా నగరంలో న్యాయవాదులపై దాడులను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి విప్లవ రెడ్డి, జనరల్ సెక్రెటరీ వోద్యారపు రవికుమార్ మాట్లాడుతూ, న్యాయవాదులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మాసబ్ ట్యాంక్ లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ను కారుతో యాక్సిడెంట్ చేసి దారుణంగా చంపడం క్రూరమైన చర్య అని, వక్ఫ్ బోర్డ్ ఆస్తులపై గతం నుంచి కొట్లాడుతున్న న్యాయవాదిపై గతంలోనూ దాడులు జరిగాయని, అప్పుడే పోలీసులకు ఫిర్యాదులు చేసినా సరైన పద్ధతిలో పట్టించుకోలేదని,అందువల్లే దారుణ హత్యకు గురి అయ్యాడని,రాష్ట్ర గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న న్యాయవాదుల రక్షణ కోసం చట్టం  వెంటనే అమలు చేయాలని కోరారు. న్యాయవాదులపై దాడులు చేసే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొడ్డు రమేష్ కుమార్, జాయింట్ సెక్రటరీ పి.మల్లేష్, లైబ్రరీ కార్యదర్శి పిఆర్వి ప్రసాద్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

About The Author