ప్రశ్నిస్తే సంకెళ్లా?.. మేధావి నాగేశ్వర్‌రావుపై కక్షసాధింపుపై ‘యాదగిరి’ నిప్పులు!

  • ఎన్టీఆర్ చావుకు కారణమైనోడు సీఎం.. ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్నోడు డిప్యూటీ సీఎం!
  • *పవన్ కళ్యాణ్ ఒక 'లిల్లీపుట్'.. చేగువేరా బొమ్మలు వదిలి చంద్రబాబు పల్లకీ మోస్తున్నాడు!
  • *తెలంగాణ మీడియాలో ఆంధ్రా పెత్తనం ఏంది?.. స్థానిక జర్నలిస్టులకు దక్కని గుర్తింపు!
  • *ప్రజాస్వామ్య గొంతుకలపై అణచివేత.. ఆర్టికల్ 19(1)(a) ఉల్లంఘనపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ధ్వజం.

ప్రశ్నిస్తే సంకెళ్లా?.. మేధావి నాగేశ్వర్‌రావుపై కక్షసాధింపుపై ‘యాదగిరి’ నిప్పులు!

హైదరాబాద్:

సమకాలీన రాజకీయాలపై విశ్లేషణలు చేస్తూ, పాలకుల తప్పులను ఎండగట్టే ప్రముఖ విద్యావేత్త, మేధావి ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌రావును అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాస్తూ, కేవలం విమర్శలకే ఒక మేధావిని అక్రమంగా నిర్బంధించాలని చూడటం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లపై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పాలకుల కక్షసాధింపు ధోరణిని తూర్పారబట్టారు.

*చేగువేరా టు చంద్రబాబు.. పవన్ ఒక ‘లిల్లీపుట్’!
ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు లాంటి మేధావి ముందు పవన్ కళ్యాణ్ ఒక ‘లిల్లీపుట్’ (వామనుడు) లాంటివాడని పాశం యాదగిరి ఎద్దేవా చేశారు. ఒకప్పుడు విప్లవ వీరుడు చేగువేరా బొమ్మలను, ఆయన సిద్ధాంతాలను గుండెలకు హత్తుకుని తిరిగిన పవన్ కళ్యాణ్.. ఈరోజు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు బొమ్మలను పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. "ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇతరులకు సంస్కారం గురించి హితబోధలు చేయడం విడ్డూరంగా ఉంది. అసలు అటువంటి వ్యక్తిని తీసుకువెళ్లి డిప్యూటీ సీఎంను చేయడమే ఒక పెద్ద రాజకీయ తప్పిదం" అని ఆయన వ్యాఖ్యానించారు.

*అధికారం కోసం రంగులు మార్చే ‘బాబు’ నీతులు చెప్తారా?
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు రాజకీయాలకు, ఆయన మరణానికి కారకుడైన చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్లీ ఏపీకి ముఖ్యమంత్రిగా కూర్చోవడం ప్రజాస్వామ్యానికే దారుణమని యాదగిరి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసం రోజుకొక రాజకీయ పార్టీని, రంగులను మార్చే ఇటువంటి నాయకులు ఈరోజు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మేధావులపై నీతులు చెప్పడం, బెదిరింపులకు దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

*రాజ్యాంగ ఉల్లంఘన.. ‘సుప్రీం’ తీర్పులకు పాతర!
ప్రజాస్వామ్యంలో పాలకుల విధానాలను విమర్శించడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దీన్ని అణచివేయడం భారత రాజ్యాంగంలోని "ఆర్టికల్ 19(1)(a) (భావప్రకటన స్వేచ్ఛ)" ను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఈ సందర్భంగా జర్నలిస్టు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు సైతం పదే పదే తన తీర్పుల్లో (ఉదాహరణకు: శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు) కేవలం ప్రభుత్వ విధానాలపై అసమ్మతి లేదా విమర్శలు చేసినంత మాత్రాన క్రిమినల్ కేసులు పెట్టడం లేదా అరెస్టులు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. రాజకీయ కక్షసాధింపు చర్యల కోసం న్యాయవ్యవస్థను, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

*తెలంగాణ మీడియాలో ఆంధ్రా పెత్తనం ఏంది?
ఇదే వేదికపై తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను పాశం యాదగిరి సంచలన వ్యాఖ్యలతో బట్టబయలు చేశారు. స్వరాష్ట్రమైన తెలంగాణలో స్థానిక జర్నలిస్టులకు కాకుండా, ప్రస్తుతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన జర్నలిస్టులకే అక్రిడిటేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో V6, T-News మినహాయిస్తే, మిగిలిన ప్రధాన వార్తా ఛానళ్లన్నీ నేటికీ ఆంధ్రా యాజమాన్యాల చేతుల్లోనే ఉన్నాయని, మీడియా రంగంలో ఇప్పటికీ వారి ఆధిపత్యమే నడుస్తోందని.. మన జర్నలిస్టులకు సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజం, ఇక్కడి జర్నలిస్టు లోకం మేధావులపై జరుగుతున్న ఇటువంటి అక్రమ దాడులను, అరెస్ట్ ప్రయత్నాలను ఏమాత్రం సహించబోదని, ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలుస్తుందని యాదగిరి స్పష్టం చేశారు.

About The Author