ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

సిద్దిపేట:

రైతులు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అత్తు ఇమామ్ తెలిపారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో సదానందం ను కలిసి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన వర్షాలకు మార్కెట్ యార్డుల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయిందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో రాజకీయ లాభాల కోసం బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయిన తర్వాతే బీఆర్ఎస్‌కు రైతులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించిన ఆయన, గతంలో రైతులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి సంకెళ్లు వేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు, గయాజుద్దీన్, హర్షద్, దస్తగిరి, ముదసిరి తదితరులు పాల్గొన్నారు.

About The Author