రైతులు జీలుగ, జనుము సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

- తొగుట ఏఎంసి చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్)

రైతులు జీలుగ, జనుము సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

దుబ్బాక:

రైతులు జీలుగ, జనుము సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని తొగుట ఏఎంసి చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) అన్నారు. మంగళవారం 
సిద్దిపేట జిల్లా  తొగుట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో రైతులకు జీలుగ, జనుము సబ్సిడీ విత్తనాలను వైస్ చైర్మన్ కొంగరి నర్సింలు, స్థానిక సర్పంచ్ శోభ కొండల్ రెడ్డి, ఏఓ మోహన్, డైరెక్టర్ ఆన్సర్ లతో కలిసి తొగుట ఏఎంసి మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు పచ్చిరొట్ట ఎరువుల కోసం ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను అందిస్తున్నదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జీలుగ విత్తనాల విక్రయ ధర కిలోకు రూ.163.50 కాగా, ప్రభుత్వం రూ.81.75 సబ్సిడీ అందిస్తోందన్నారు. రైతులు కిలోకు రూ.81.75 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 30 కిలోల బ్యాగ్ ధర రూ.2452గా ఉందన్నారు. జనుము విత్తనాల విక్రయ ధర కిలోకు రూ.155.50 కాగా, రూ.77.75 సబ్సిడీ లభిస్తోందని చెప్పారు. రైతులు కిలోకు రూ.77.75 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, 40 కిలోల బ్యాగ్ ధర రూ.3110గా నిర్ణయించినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో  గ్రామ పార్టీ అధ్యక్షుడు భరత్ తేజ, నాయకులు లక్ష్మారెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎల్లారెడ్డి, నాగరాజు, వంశీ రెడ్డి, పోచయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

About The Author