మేధావి వర్గంపై కక్షసాధింపు? కూటమి దూకుడుపై ‘తెలంగాణ’ ఆగ్రహజ్వాలలు
- ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఏ.పీలో వరుస కేసులు.. హైదరాబాద్‌లో అరెస్టుకు పోలీసుల రంగప్రవేశం?
- *‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం’.. చంద్రబాబు నివాసం ముట్టడికి ‘కవితక్క’ పిలుపు!
- *బేషరతుగా వెనక్కి తీసుకున్నా వేధింపులా? భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ ప్రజాస్వామ్యవాదుల మండిపాటు!
సారూ.. ఇదా మన ‘ప్రజాస్వామ్య’ ప్రగతి? తప్పుగా మాట్లాడానని మే 21నే ప్రొఫెసర్ నాగేశ్వర్ బేషరతుగా క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్నా, ఏపీ కూటమి ప్రభుత్వానికి కసి తీరలేదు కాబోలు! నయా చట్టాల (BNS 192, 196, 352) పదును చూపిస్తూ, హైదరాబాద్ గడ్డపై అరెస్టుల కోసం వేటగాళ్లలా ఏపీ పోలీసులు వాలిపోవడం భలే విచిత్రం.
రాజకీయ విమర్శలని ఎదుర్కొనే సత్తా లేక, ఒక విద్యావేత్త గొంతు నొక్కడానికి సరిహద్దులు దాటి మరీ ఇంత కక్షసాధింపా? ‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోం’ అంటూ కవితక్క చంద్రబాబు నివాస ముట్టడికి పిలుపునివ్వడం, బీసీ నేత రామకోటి ప్రాణత్యాగానికైనా సిద్ధమనడంతో వాతావరణం అప్పుడే హీటెక్కింది. తప్పు తెలుసుకుని తగ్గిన మేధావిని కూడా ఇలా వేటాడటం చూస్తుంటే.. భావప్రకటనా స్వేచ్ఛకు కాలం చెల్లిందనిపిస్తోంది!
హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజేసుకున్నాయి. ప్రముఖ విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస కేసులు నమోదు చేయడం, ఆయన అరెస్టుకు ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో రంగంలోకి దిగారన్న ప్రచారం తెలంగాణ సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఏపీలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై తెలంగాణ మేధావి వర్గం, రాజకీయ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. ఒక విద్యావేత్తపై ఈ తరహా నిరంకుశ పోకడలకు దిగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని పలువురు మండిపడుతున్నారు.
*‘బాబు’ నివాసం ముట్టడిస్తాం: కె. కవిత తీవ్ర హెచ్చరిక
తెలంగాణ మేధావుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కె. కవిత స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను వేధించడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని సవాలు చేయడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కె. కవిత, టీఆర్‌ఎస్ చీఫ్,
*ప్రాణత్యాగానికైనా సిద్ధం: బీసీ నేత అల్లంపల్లి రామకోటి
ఈ వివాదంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అల్లంపల్లి రామకోటి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ వైఖరిని ఉతికారేశారు.
*‘కవితక్క’ పిలుపే మాకు శాసనం: అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే.. కవితక్క పిలుపు మేరకు ఎంత దూరమైనా వెళ్తాం.
పోలీసుల దౌర్జన్యాలను అడ్డుకుంటాం: అక్రమ అరెస్టే లక్ష్యంగా వస్తున్న ఏపీ పోలీసుల దౌర్జన్యాలను అడ్డుకోవడానికి, తెలంగాణ ఆత్మగౌరవ రక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని రామకోటి ప్రకటించారు.
*వెనక్కి తీసుకున్నా వేటాడటమేనా? సర్వత్రా విమర్శలు
గత మే 19న ఒక డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలను ప్రొఫెసర్ నాగేశ్వర్ మే 21 నాడే బేషరతుగా వెనక్కి తీసుకున్న విషయాన్ని మేధావులు గుర్తుచేస్తున్నారు. నిందితుడు స్వయంగా వివరణ ఇచ్చి, వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తర్వాత కూడా క్రిమినల్ సెక్షన్ల (BNS 192, 196, 352) కింద అరెస్టులకు ప్రయత్నించడం కేవలం రాజకీయ కక్షపూరిత చర్యేనని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.
*కూటమి మిత్రపక్షాల్లోనూ అసంతృప్తి!*
ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ తీరుపై అటు వైఎస్సార్‌సీపీ, ఇటు టీఆర్‌ఎస్ నేతలతో పాటు, కూటమిలోని మిత్రపక్షమైన బీజేపీకి చెందిన కొందరు నేతలు కూడా లోలోపల తప్పుబడుతుండటం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల కదలికలపై తెలంగాణ శ్రేణులు నిఘా ఉంచినట్లు, ఏ క్షణంలోనైనా చంద్రబాబు నివాస ముట్టడికి భారీగా తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ ఉత్కంఠకు దారితీస్తున్నాయి.
