బక్రీద్‌కు సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ
- అధికారులకు కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాలు జారీ
సిద్దిపేట:
బక్రీద్ పండుగ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అశ్రిత్ కుమార్ అధికారులను ఆదేశించారు.ఈ మేరకు బుధవారం సిద్దిపేటలో ఆయన ఆధ్వర్యంలో వార్డు ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్‌పీలతో సమావేశం నిర్వహించారు. జంతువుల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపాలిటీ అందించే కవర్లలో సేకరించి చెత్త వాహనాలకు అందజేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈద్గాలు, మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్యం, బ్లీచింగ్ చల్లడం, తాగునీటి సదుపాయాలు కల్పించాలని తెలిపారు.ఇంటి, నీటి పన్నుల వసూళ్లు సకాలంలో చేపట్టాలని, కొత్త గృహాలకు ఇంటి నంబర్లు కేటాయించాలని ఆదేశించారు. కొత్త నిర్మాణాలు అనుమతుల ప్రకారమే జరుగుతున్నాయో పరిశీలించాలని సూచించారు.
పట్టణంలో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్ల నిర్మాణ పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.స్వచ్ఛ సర్వేక్షన్ 2026 లో సిద్దిపేటను దేశంలో ప్రథమ స్థానంలో నిలపడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మేనేజర్ శ్రీనివాస్, ఆర్‌వో శ్రీకాంత్, ఆర్‌ఐలు, వార్డు ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సంతోషి (టీఎంసీ), జ్యోతి, రేణుక (సీవోలు), ఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.
