పోరుమామిళ్ల పోలిస్టేషన్ ను మైదుకూరు డిఎస్పీ ఆకస్మిక తనిఖీ

WhatsApp Image 2025-12-26 at 7.39.39 PM

పోరుమామిళ్ళ : 

మైదుకూరు DSP పోరుమామిళ్ల సర్కిల్ ఆఫీస్, పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ మరియు శ్రీ అవధూత కాశినాయన పోలీస్ స్టేషన్లను తనిఖీ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ యొక్క సమగ్ర కార్యాచరణ, పరిపాలనా సామర్థ్యం, శాంతిభద్రతల నిర్వహణ, నేరాల గుర్తింపు మరియు ప్రజాసేవల అందజేతను అంచనా వేయుటకు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ సందర్భంగా ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్లు, కేసు డైరీలు, స్టేషన్ నేరాల రికార్డులు, ప్రాపర్టీ రిజిస్టర్లు మరియు జనరల్ డైరీలను పరిశీలించటం జరిగింది.
స్టేషన్‌లోని సిబ్బంది బలం, విధుల కేటాయింపు పట్టికలు, క్రమశిక్షణ మరియు శాఖా ఆదేశాల పాటింపును సమీక్షించటం జరిగింది. స్టేషన్ ప్రాంగణం పరిశుభ్రత, లాకప్ పరిస్థితి, మౌలిక సదుపాయాల లభ్యత, వాహనాల పరిస్థితిని కూడా తనిఖీ చేయడం జరిగింది.
పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, పిటిషన్ల పరిష్కారం మరియు న్యాయస్థాన ఆదేశాల అమలును క్షుణ్ణంగా పరిశీలించటం జరిగింది.కార్యక్షమత, బాధ్యతాభావం మరియు ప్రజాముఖ పోలీసింగ్‌ను మెరుగుపరచుటకు అవసరమైన ఆదేశాలు మరియు మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల CI, K. హేమ సుందర రావు గారు, పోరుమామిళ్ల SI, R. V. కొండారెడ్డి గారు, కాశినాయన SI, P. యోగేంద్ర గారు, స్టేషన్ సిబ్బంది మరియు పోరుమామిళ్ల మండల మహిళా పోలీసులు పాల్గోనడం జరిగింది.

About The Author

Related Posts