యూరియా పాస్టేటు, తదితర ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలి
- అధిక ధరలకు విక్రయిస్తున్న ఎరువుల దుకాణాదారులను కట్టడి చేయాలి..
- ఏపీ రైతు సంఘం డిమాండ్..

పోరుమామిళ్భ :
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మండల రైతు సంఘం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోరుమామిళ్ల మండలంలోని రైతు సంఘం ముఖ్య నాయకులతో కలిసి సమావేశం ముఖ్యఅతిథిగా విచ్చేసిన రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మొంత తుఫాను, దిత్వా తుఫాను మిగిల్చిన నష్టం నుండి కోలుకొని రైతులు రవి సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు కావలసిన యూరియా, తదితర ఎరువులను రైతులకు అందుబాటులో నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రైతులకు అందించాలని అధిక ధరలకు అమ్ముతున్న ఎరువుల దుకాణా దారులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు, గిట్టుబాటు ధర లేక రైతులు ఆయన కాడికి దళారులకు అమ్ముకోవడం నష్టపోవడం జరుగుతున్నది ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తద్వారా రైతులు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కోడూరుకేశవ పిడుగు పీరయ్య విష్ణు శ్రీనివాసులు బెల్లం భాష తదితరులు పాల్గొన్నారు.
