క్రికెట్ టోర్నమెంట్లో వరికుంట్ల టీం విజయం.
రెవిరెంట్ ఫాదర్. జయరాజ్ ఆధ్వర్యంలో టూనమెంట్ నిర్వాహన

పోరుమామిళ్ల :
కడప జిల్లా శ్రీ అవధూత కాశినాయన మండలం వరికుంట్ల విచారణలో యువతకు నూతన సంవత్సర సందర్భంగా టోర్నమెంట్ నిర్ణయించడం జరిగింది.ఈ టోర్నమెంట్లో విచారణ లో ఉండు బాలయ పల్లె. నాయనపల్లి. ఎగువ పాలెం. దిగువపాలెం యువత క్రికెట్ టోర్నమెంట్ కు ముందుకు రావడం జరిగింది. ఈ టోర్నమెంట్లో ఘనవిజం సాధించిన వరికుంట్ల యూత్ కు విచారణ గురువులు అభినందనలు తెలియజేశారు. ఇలాంటి ఆటల పోటీలు ఇంకా విజయం సాధించాలని మరియు యువత అన్ని విషయాలలో ముందుండి నడవాలని ఈ నూతన సంవత్సర శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వచ్చిన మిగతా గ్రామాల యువతకు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ అన్ని గ్రామాలకు గాను వరికుంట్ల యువత క్రికెట్ టోర్నమెంట్లో విజేత సాధించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
