తోడిన కొద్దీ బయటకు వస్తున్న పీడీఎస్ రైస్ దందా!

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 11: నిర్మల్ జిల్లా భైంసాలో పీడీఎస్ రైస్ దందా కేసు వివరాలు ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు. ధర్మాబాద్ నుంచి తరలిస్తూ భైంసాలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం ఘటనలో ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లు.. అటు పీడీఎస్ రాకెట్ తోపాటు ఇటు రైస్ మిల్లుకు ఉన్న లింక్ బయటప డింది. కేసు విచారణలో పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ధర్మాబాద్కు చెందిన ఒకరు జిల్లా లో ఏజెంట్ల నుంచి బియ్యం సేకరించి, తిరిగి జిల్లాకే సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పెద్దమొత్తంలో లారీలో బియ్యం తరలిస్తూ పట్టుబడడంతో దందాపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ఆదేశా లతో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ ఏఎస్పీ రాజే శ్మీనాతో కలిసి ధర్మాబాద్లోని స్థావరంపై దాడి చేయగా, పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రమాదం పీడీఎస్ బియ్యం దందా గుట్టు రట్టు చేసింది. బియ్యం అక్రమ రవాణా కేసు లో పోలీసులు దర్యాప్తు చేయగా, రైస్మిల్కు ఉన్న లింకు బయటపడింది. దీంతో సదరు మిల్లుపై దాడిచేయగా, అప్పటికే మిల్లు నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు లారీల ధాన్యం గుర్తించారు. ఒక్క ప్రమాదంతో ఇటు పీడీఎస్ దందా, మరోవైపు వడ్ల అక్రమ రవాణా డొంక కదిలింది. పీడీఎస్ బియ్యం రైస్ మిల్లుకు… పీడీఎస్ బియ్యం పట్టుబడిన ఘటనలో ఎస్సీ జానకీ షర్మిల ప్రత్యేక దృష్టి సారించి రాకెట్ భేదించారు. అంతేగాక, టాస్క్ఫోర్స్ రాష్ట్ర అధికారులు సైతం రెండురోజులుగా జిల్లాలోనే తనిఖీలు చేపడుతు న్నారు. లక్ష్మణచాందలో రెండు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా సాగుతున్న పీడీఎస్ బియ్యం దందా గుట్టురట్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల తెలిపారు. భైంసా పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం వివ రాలు వెల్లడించారు. ధర్మాబాద్కు చెందిన రవూఫ్ అనే వ్యక్తి ఈనెల 8న ధర్మాబాద్ నుంచి లక్ష్మణచాం దలోని ఓ రైసిమిల్కు 36 టన్నుల పీడీఎస్ బియ్యం లోడ్తో లారీ పంపించాడు. లారీ భైంసా పట్టణం లోకి చేరుకోగానే, నిర్మల్ చౌరస్తా వద్ద ఓ కారును ఢీకొంది. ఈ ఘటనతో సదరు లారీలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఎస్సీ ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ప్రత్యేకం గా దర్యాప్తు జరిపారు. ఇందులో భాగంగా నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా తో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ పోలీసుల సహకారంతో ధర్మాబాద్లో పీడీఎస్ రైస్ రాకెట్ స్థావరంపై దాడి చేశారు. జిల్లా నుంచి ధర్మాబాద్లోని సదరు స్థావరానికి తరలిస్తున్న మరో 6 టన్నుల బియ్యం బిద్రెల్లి వద్ద పట్టుకు న్నారు. లక్ష్మణచాందలోని రైస్ మిల్లులో తనిఖీ చేయ గా, అప్పటికే అక్కడ రెండు ట్రక్కుల్లో ధాన్యం తర లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి, సివిల్ సప్ల య్ అధికారులకు సమాచారమిచ్చినట్లు పేర్కొ న్నారు. ఈ మేరకు కొన్ని కీలకమైన రికార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని, కీలక నిందితుడు రవూఫ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా ఓ నెట్వర్క్ పనిచేస్తోందని, జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఏజెంట్ల ద్వారా బియ్యం సేకరించి రవూఫ్ లాంటివారు వాటిని రైసిమిల్లు లకు పంపుతున్నట్లు గుర్తించామన్నారు. రైస్ మిల్లర్లు. ఏజెంట్లు, ఇతరుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథ మికంగా అంచనా వేసినట్లు తెలిపారు. సమావేశం లో ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేశ్ మీనా ఉన్నారు. కేసు విచారణలో చురుగ్గా పనిచేసిన ముధోల్ సీఐతోపాటు ఎస్సైలు అశోక్, గణేశ్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు భీమేశ్, గగన్, విపుల్, తాహెర్, రాము, మురళి, శివ, అబుబాకర్, అం బాదాస్, అలీంను ఎస్పీ అభినందించారు. పీడీఎస్ వ్యాపారుల గుండెల్లో రైలు పరుగెడుతుంది.. మిల్లర్లపై కేసు నమోదు చేయడంతో కొండకు రైస్ మిల్లర్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు పోలీసులు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణపై దృష్టి పెట్టడం, మరోవైపు మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా బియ్యం అందిస్తోంది. అయితే, చాలామంది వీటిని తినలేక అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం దందా నిర్వహకులు ఏజెంట్లతో గ్రామాల్లో లబ్దిదారుల నుంచి బియ్యం సేకరించి, మహారాష్ట్రకు తరలించి విక్రయించేవారు. ఇలా సేకరించిన బియ్యంను పెద్దమొత్తంలో పోగు చేసి, వాటిని సన్నబియ్యంగా మార్చి ప్రత్యేక సంచుల్లో ప్యాక్ చేసి జిల్లాకు తరలించి విక్ర యిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా లోని కొన్ని రైస్ మిల్లులకు సైతం సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.

తోడిన కొద్దీ బయటకు వస్తున్న పీడీఎస్ రైస్ దందా!

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 11: నిర్మల్ జిల్లా భైంసాలో పీడీఎస్ రైస్ దందా
కేసు వివరాలు ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు.
ధర్మాబాద్ నుంచి తరలిస్తూ భైంసాలో పట్టుబడిన పీడీఎస్ బియ్యం ఘటనలో ఒకే దెబ్బకు రెండుపిట్టలు అన్నట్లు.. అటు పీడీఎస్ రాకెట్ తోపాటు ఇటు రైస్ మిల్లుకు ఉన్న లింక్ బయటప డింది. కేసు విచారణలో పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ధర్మాబాద్కు చెందిన ఒకరు జిల్లా లో ఏజెంట్ల నుంచి బియ్యం సేకరించి, తిరిగి జిల్లాకే సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పెద్దమొత్తంలో లారీలో బియ్యం తరలిస్తూ పట్టుబడడంతో దందాపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ఆదేశా లతో భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ ఏఎస్పీ రాజే శ్మీనాతో కలిసి ధర్మాబాద్లోని స్థావరంపై దాడి చేయగా, పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఓ ప్రమాదం పీడీఎస్ బియ్యం దందా గుట్టు రట్టు చేసింది. బియ్యం అక్రమ రవాణా కేసు లో పోలీసులు దర్యాప్తు చేయగా, రైస్మిల్కు ఉన్న లింకు బయటపడింది. దీంతో సదరు మిల్లుపై దాడిచేయగా, అప్పటికే మిల్లు నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్న రెండు లారీల ధాన్యం గుర్తించారు. ఒక్క ప్రమాదంతో ఇటు పీడీఎస్ దందా, మరోవైపు వడ్ల అక్రమ రవాణా డొంక కదిలింది.

పీడీఎస్ బియ్యం రైస్ మిల్లుకు…

పీడీఎస్ బియ్యం పట్టుబడిన ఘటనలో ఎస్సీ జానకీ షర్మిల ప్రత్యేక దృష్టి సారించి రాకెట్ భేదించారు. అంతేగాక, టాస్క్ఫోర్స్ రాష్ట్ర అధికారులు సైతం రెండురోజులుగా జిల్లాలోనే తనిఖీలు చేపడుతు న్నారు. లక్ష్మణచాందలో రెండు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కేంద్రంగా సాగుతున్న పీడీఎస్ బియ్యం దందా గుట్టురట్టు చేసినట్లు ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల తెలిపారు. భైంసా పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం వివ రాలు వెల్లడించారు. ధర్మాబాద్కు చెందిన రవూఫ్ అనే వ్యక్తి ఈనెల 8న ధర్మాబాద్ నుంచి లక్ష్మణచాం దలోని ఓ రైసిమిల్కు 36 టన్నుల పీడీఎస్ బియ్యం లోడ్తో లారీ పంపించాడు. లారీ భైంసా పట్టణం లోకి చేరుకోగానే, నిర్మల్ చౌరస్తా వద్ద ఓ కారును ఢీకొంది. ఈ ఘటనతో సదరు లారీలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఎస్సీ ఆదేశాల మేరకు ఏఎస్పీ అవినాష్ కుమార్ ప్రత్యేకం గా దర్యాప్తు జరిపారు. ఇందులో భాగంగా నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా తో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ పోలీసుల సహకారంతో ధర్మాబాద్లో పీడీఎస్ రైస్ రాకెట్ స్థావరంపై దాడి చేశారు. జిల్లా నుంచి ధర్మాబాద్లోని సదరు స్థావరానికి తరలిస్తున్న మరో 6 టన్నుల బియ్యం బిద్రెల్లి వద్ద పట్టుకు న్నారు. లక్ష్మణచాందలోని రైస్ మిల్లులో తనిఖీ చేయ గా, అప్పటికే అక్కడ రెండు ట్రక్కుల్లో ధాన్యం తర లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి, సివిల్ సప్ల య్ అధికారులకు సమాచారమిచ్చినట్లు పేర్కొ న్నారు. ఈ మేరకు కొన్ని కీలకమైన రికార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని, కీలక నిందితుడు రవూఫ్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. జిల్లాలో పీడీఎస్ బియ్యం దందా ఓ నెట్వర్క్ పనిచేస్తోందని, జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఏజెంట్ల ద్వారా బియ్యం సేకరించి రవూఫ్ లాంటివారు వాటిని రైసిమిల్లు లకు పంపుతున్నట్లు గుర్తించామన్నారు. రైస్ మిల్లర్లు. ఏజెంట్లు, ఇతరుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథ మికంగా అంచనా వేసినట్లు తెలిపారు. సమావేశం లో ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేశ్ మీనా ఉన్నారు. కేసు విచారణలో చురుగ్గా పనిచేసిన ముధోల్ సీఐతోపాటు ఎస్సైలు అశోక్, గణేశ్, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు భీమేశ్, గగన్, విపుల్, తాహెర్, రాము, మురళి, శివ, అబుబాకర్, అం బాదాస్, అలీంను ఎస్పీ అభినందించారు.

పీడీఎస్ వ్యాపారుల గుండెల్లో రైలు పరుగెడుతుంది..

మిల్లర్లపై కేసు నమోదు చేయడంతో కొండకు రైస్ మిల్లర్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు పోలీసులు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణపై దృష్టి పెట్టడం, మరోవైపు మిల్లుల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ షాపుల ద్వారా బియ్యం అందిస్తోంది. అయితే, చాలామంది వీటిని తినలేక అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం దందా నిర్వహకులు ఏజెంట్లతో గ్రామాల్లో లబ్దిదారుల నుంచి బియ్యం సేకరించి, మహారాష్ట్రకు తరలించి విక్రయించేవారు. ఇలా సేకరించిన బియ్యంను పెద్దమొత్తంలో పోగు చేసి, వాటిని సన్నబియ్యంగా మార్చి ప్రత్యేక సంచుల్లో ప్యాక్ చేసి జిల్లాకు తరలించి విక్ర యిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా లోని కొన్ని రైస్ మిల్లులకు సైతం సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు.

About The Author

Related Posts