అర్చకులపై దాడి చేయడం హేయమైన చర్య: వి.హెచ్.పి అర్చక పురోహిత్ సహా ప్రముఖ్ ఓరుగంటి సురేష్
బూర్గంపాడు, ఫిబ్రవరి 11 (భారతశక్తి): చిలుకూరు ఆలయంలోని ప్రధానార్చకులు రంగరాజన్ పై జరిగిన హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ (వి.హెచ్.పి) అర్చక పురోహిత్ సహా ప్రముఖ్ ఓరుగంటి సురేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం మండలంలోని సారపాక ప్రధాన కేంద్రంలో గల సాకేతపురి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విలేకరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ అర్చకులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. రంగరాజన్ పై జరిగిన దాడిని దేవాలయ వ్యవస్థపై, అర్చక వ్యవస్థపై, సామాజిక సంస్కరణ వ్యవస్థపై, యావత్ హిందూ సమాజంపై జరిగిన దాడిగా వి.హెచ్.పి భావిస్తుదని తెలిపారు. దాడికి పాల్పడ్డ సంఘవిద్రోహ శక్తులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. సనాతన ధర్మపరంపరకు అవమానం కలిగించిన దోషులను హిందూ సమాజం ఏనాటికి క్షమించదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల శ్రీ సీతారాముల పుణ్య క్షేత్రం అయిన భద్రాచలంలో పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘం నిర్వహించిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన రమేష్ పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సభల్లో శ్రీరాముని, రామాయణాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే నోరు మెదపక పోవడం బాధాకర విషయమన్నారు. రంగరాజన్ పై జరిగిన హత్యాయత్నం పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, నింధితుల వెనకాల ఉన్న సంఘ విద్రోహ శక్తులను చట్టప్రకారం ఉక్కుపాదంతో అణిచివేసే చర్యలు పోలీసులు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రంగరాజన్ తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ తరుపున కోరారు.