సామాజిక అంశంగా మారిన పెన్షన్ దారుల సమస్యలు..

- ఆర్ధిక భద్రత కోల్పోతున్న పెన్షన్ దారులు.. 
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుమిలిపోతున్న వేలమంది.. 
- ఆసరాగా ఉంటుందన్న పెన్షన్ నిరాశను మిగిలిస్తోంది.. 
- దాదాపు 30 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ.. 
- విశ్రాంతి తీసుకోవాల్సిన తరుణంలో ఇబ్బందులు పడుతున్న వైనం.. 
- ఒక్కోసారి నెలల తరబడి పెన్షన్ అందడం లేదంటున్న బాధితులు.. 
- స్వయంగా ముఖ్యమంత్రి నిధులు లేవని చెప్పడం సిగ్గుచేటు.. 
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో విలవిల లాడిపోతున్న పెన్షన్ దారులు.. 
- పీ.ఆర్.సి. అమలులో కూడా జాప్యం జరుగుతోంది.. 
- ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యే శరణం అంటున్న పెన్షన్ దారులు.. 
- పెన్షన్ దారుల తరఫున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "

download (2)

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

Read More నాగారం గ్రామ సర్పంచిగా చందరాజు లావణ్య సంతోష్ నామినేషన్ దాఖలు

దాదాపు 35 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను రిటైర్ అవుతున్న రోజు ఒక పండుగలాగా జరుపుకుంటారు.. తోటి ఉద్యోగులు ఎంతో గౌరవంగా సన్మానించుకుంటారు.. గొప్పగా అతడు చేసిన సేవలను చెప్పుకుంటారు.. ఎంతో ఆనందంగా ఇంటికి వస్తాడు..  శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తాడు.. అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కాలం గడిపేస్తుంటారు..  అతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాడ్యూటీ లాంటి పైకాన్ని తన వారసులకు అందించి గర్వంగా ఫీల్ అవుతాడు.. అంతా బాగానే ఉంది అనుకున్నంతలో  నెలరోజులు తిరిగిపోతాయి.. విధుల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆటో, ఇటుగా వచ్చేది జీతం.. దాంతో తన కుటుంబ అవసరాలు  తీరిపోయేవి.. కానీ ఇప్పుడు పెన్షన్ సకాలంలో అందకపోవడంతో ఊహించని ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది..  ఖర్చులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి.. ఆ వయసులో ఏపనీ చెయ్యాలన్నా కష్టమే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రిటైర్డ్ ఉద్యోగి ఏమి చేయగలడు..?  ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుదేలవుతున్న పెన్షనర్ల జీవితాలు ఎప్పుడు గాడిలో పడతాయి..? 

Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ


తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్‌దారుల సమస్యలు ప్రస్తుతం ఒక ప్రధాన సామాజిక అంశంగా మారాయి. పెన్షన్ అనేది వృద్ధులు, వికలాంగులు, విధవలు, ఒంటరి మహిళలు వంటి బలహీన వర్గాలకు ఆర్థిక భద్రత ఇచ్చే పథకం. కానీ అమలు స్థాయిలో అనేక ఇబ్బందులు ఎ దురవుతున్నాయి.

Read More భూ నిర్వాసితులపై చిన్న చూపు చూస్తున్న సింగరేణి యాజమాన్యం.

పెన్షన్‌దారుల ఇబ్బందులు :

Read More రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసిని అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పెన్షన్ అందడంలో ఎంతో జాప్యం జరుగుతోంది..  ప్రతీ నెలా 1వ తేదీకి రావాల్సిన పెన్షన్ చాలాసార్లు ఆలస్యంగా జమ అవుతోంది.
అంతేకాకుండా అర్హత ధృవీకరణలో ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతున్నాయి..  కొత్త కొత్త సర్వేలు, ఆధార్ లింకింగ్, బయోమెట్రిక్ గుర్తింపులో లోపాల వల్ల కొందరి పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. అంతే కాకుండా గ్రామ స్థాయిలో అవినీతి లేదా దుర్వినియోగం జరుగుతోంది.. వృద్ధులు లేదా వికలాంగులు గ్రామసభల వద్ద తిరగాల్సి వస్తోంది. కొందరు మధ్యవర్తులు లంచాలు డిమాండ్ చేస్తున్నారు.
అదే విధంగా పెన్షన్ మొత్తాలు తక్కువగా ఉండటం జరుగుతోంది..  ప్రస్తుత పెన్షన్ రేట్లు ద్రవ్యోల్బణం కంటే చాలా తక్కువగా ఉన్నాయి..   ఇక  డిజిటల్ వ్యవస్థలో సమస్యలు విపరీతంగా ఎదురవుతున్నాయి..  ఈ కేవైసీ లేదా బయోమెట్రిక్ ఫెయిల్ అవడం వల్ల పేదవారికి ఆన్‌లైన్ సిస్టమ్ ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా కొత్త లబ్ధిదారుల జాబితాలో చేర్చడంలో ఆలస్యం జరుగుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయి.. అర్హులైన చాలా మంది ఇంకా జాబితాలో లేకపోవడం ఆందోళన కలిగించే విషయం.. 

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యం :

Read More ఎస్జీఫ్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అల్పోర్స్ ఇ-టెక్నో

నియమిత పర్యవేక్షణ లేకపోవడంతో ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతున్నాయి..  అధికారులు లబ్ధిదారుల జాబితాను సమయానికి అప్‌డేట్ చేయడం లేదు. ఫీల్డ్ వెరిఫికేషన్ లో చాలా లోపాలు కనిపిస్తున్నాయి.. 

Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..

బడ్జెట్ కేటాయింపులలో జాప్యం :

Read More పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

కొన్నిసార్లు రాష్ట్ర బడ్జెట్‌లో పెన్షన్ నిధుల కేటాయింపులు ఆలస్యమవుతున్నాయి. సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు వ్యవస్థ బలహీనంగా ఉండటం మరో ప్రమాదకర వ్యవహారం..  లబ్ధిదారులకు సమర్థమైన గ్రీవెన్స్ మెకానిజం లేకపోవడం కూడా ఒక ప్రధాన సమస్యగా మారిపోయింది.. 

Read More కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆవాల సరోజ మృతి

తీసుకోవాల్సిన చర్యలు :

Read More నామినేషన్ ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా చూడాలి

నిర్వహణలో పారదర్శకత ఉండాలి.. ప్రతి మండల/గ్రామం స్థాయిలో లబ్ధిదారుల జాబితా పబ్లిక్‌గా అందుబాటులో ఉండాలి. పెన్షన్‌ మొత్తాల పెంపు జరగాలి..  ద్రవ్యోల్బణం ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పునఃసమీక్షించాలి. పీ.ఆర్.సి. తక్షణమే అమలుచేయాలి.. 
టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం అవసరం..  మొబైల్ యాప్ లేదా హెల్ప్‌లైన్ ద్వారా లబ్ధిదారులు తమ పెన్షన్ స్థితిని తెలుసుకోవచ్చు.

గ్రామ స్థాయి ఫిర్యాదు కేంద్రాలు :

లబ్ధిదారులు నేరుగా ఫిర్యాదు చేయగల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి..  వారి సమస్యలు వ్యక్తిగతంగా వినే సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. అలాగే సామాజిక పర్యవేక్షణ కమిటీలు నియమించాలి.. స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్.జీ.ఓ. లు కలసి పెన్షన్ అమలు పర్యవేక్షించాలి.

ప్రత్యేక నిధి :
ఆలస్యాలు నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధిని సృష్టించవచ్చు. పెన్షన్ అనేది దయ కాదు..  ప్రభుత్వం దీనిని సక్రమంగా అమలు చేయాలి. సాంకేతిక, పరిపాలనా మార్పులతో పాటు మానవతా దృక్పథం అవసరం.

చివరగా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఎప్పుడు విడనాడుతుంది ? 

జీవితమంతా ప్రభుత్వ సేవలో నిబద్ధతతో పనిచేసి, పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితాన్ని ఆశించే వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పుడు పెన్షన్ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి రోజు రోజుకు తీవ్రమవుతోంది.

ఉద్యోగ విరమణ అయిన నెలల తరబడి పెన్షన్ ఖాతాల్లో జమ కావడం లేదు. కొన్ని సందర్భాల్లో పెన్షన్ పేపర్లు, సర్వీస్ రికార్డులు, లాస్ట్ పే సర్టిఫికేట్‌లు ట్రెజరీ లేదా డిపార్ట్మెంట్ కార్యాలయాల్లో నెలల తరబడి అటకెక్కిపోతున్నాయి. సాంకేతిక వ్యవస్థలు ఉన్నా సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

పెన్షన్ ఆమోదం అంటే కేవలం ఫైనాన్స్ శాఖ బాధ్యత మాత్రమే కాదు. సంబంధిత విభాగం, ఆడిట్, ట్రెజరీ, పెన్షన్ డైరెక్టరేట్  ఈ నాలుగు స్థాయిల సమన్వయం అవసరం. కానీ ఈ విభాగాల మధ్య సరైన సమాచార మార్పిడి లేకపోవడం వల్లే ఆలస్యం జరుగుతోంది. అనేక చోట్ల సిబ్బంది కొరత కూడా ప్రధాన కారణంగా మారింది.


అలాగే ఐ.ఎఫ్.ఎం.ఐ.ఎస్., హెచ్.ఆర్.ఎం.ఎస్. వంటి ఆన్‌లైన్ వ్యవస్థలు ఉన్నా, అవి సమర్థంగా పనిచేయకపోవడం పెద్ద సమస్య. డేటా అప్‌డేట్ కాకపోవడం, లాగిన్ సమస్యలు, సర్వర్ ఫెయిల్యూర్స్ వంటి సాంకేతిక లోపాలు పెన్షన్ ప్రాసెస్‌ను నెలల తరబడి నిలిపివేస్తున్నాయి. పెన్షన్ సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేయాలి.. అన్ని దశలు ఒకే వేదికలో పూర్తి కావాలి. ఉద్యోగి రిటైర్మెంట్‌కి 3 నెలల ముందే పెన్షన్ ఫైల్ స్వయంచాలకంగా ప్రారంభం కావాలి. పెన్షనర్ తన ఫైల్ ఎక్కడ ఉందో తెలుసుకునే సౌకర్యం కల్పించాలి.
ప్రతి జిల్లాలో పెన్షనర్ల ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వృద్ధ పెన్షనర్లకు హెల్త్ కార్డ్, మెడికల్ బెనిఫిట్స్ సులభంగా అందేలా చూడాలి. పెన్షనర్ల సంఘాలు సక్రమంగా సమన్వయం చేసుకుంటూ తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించాలి. మీడియా, సోషల్ మీడియా వేదికల్లో ఈ సమస్యలను విస్తృతంగా ప్రస్తావించడం ద్వారా ప్రజా మద్దతు పొందాలి.

పెన్షన్ దారులు చెబుతున్న మాట ఏమిటంటే పెన్షన్ అనేది దాతృత్వం కాదు.. అది సేవ చేసిన ప్రతి ఉద్యోగి హక్కు. ప్రభుత్వ నిర్లక్ష్యం, సాంకేతిక లోపాలు, సమన్వయ లోపం వంటి కారణాలతో ఈ హక్కు వాయిదా పడడం ప్రజాస్వామ్యానికి తగదు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుని పెన్షనర్ల వ్యధకు ముగింపు పలకాలని ఆశిస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

About The Author