నేటి భారతం :
2.jpg)
ప్రశ్న ఏదైనా కావచ్చు మీరు ప్రేమతో బదులిస్తే,
మనం గడిపే ప్రతిరోజూ అందంగా ఉంటుంది.
బదులిచ్చే విధానంతో సగం ప్రపంచాన్ని ఈజీగా గెలవవచ్చు..
అలాగే అందరం అదృష్టం అంటుంటాం కానీ చాలామంది
అదృష్టమంటే ధనం, ఆస్తులుండటం అనుకుంటారు..
ఇది చాలా పొరబాటు..
మీ చేతి నిండా పని, కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర..
అలాగే కష్టసుఖాలను పంచుకునే స్నేహితులు, సన్నిహితులు
ఉండటమే అదృష్టమంటే..
నీ జీవితం నీ ఇష్టానుసారంగా సాగుతుంది..
ఆ ప్రయాణంలో అది నీకు ఎన్నెన్నో పాఠాలను నేర్పిస్తుంది..
మంచిని తీసుకుని, చెడును వదిలేయడం నీ నేర్పరితనం..
అలాగే ఓడిపోతామేమో అన్న భయాన్ని ఈ క్షణమే వదిలెయ్యండి..
నువ్వు ఒప్పోకోనంతవరకు నువ్వు ఎప్పుడూ ఓడిపోవు..
ఎక్కువుగా ఆందోళన చెందవద్దు.. చేదు ఆలోచనలు చేయవద్దు..
ఎందుకంటే మన జీవితకాలం చాలా చిన్నది..
సమయం చాలా వేగంగా గడిచిపోతుంది.
గడిచిపోయిన క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు..
సో మిత్రమా నీకు అందిన ప్రతి క్షణాన్ని నీకు అనువుగా మార్చుకో..
అదే నీకు విక్టరీని అందిస్తుంది.. అల్ ది బెస్ట్..
