పోస్ట్‌ చూసి ఊహాగానాలు చేయకండి!

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) కుమారుడు అకీరా నందన్‌ (Akhiranandan) దర్శకుడు రాఘవేంద్రరావు, ఆయన మనవడు కార్తికేయతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! కార్తికేయ, అకీరాతో దిగీన ఫొటో పంచుకున్న ఆయన ‘‘నాలుగో తరం అబ్బాయిలతో రాఘవేంద్రరావు(Raghavendra Rao) ’’ అని పేర్కొన్నారు. ‘నా మనవడు కార్తికేయ, పవన్‌ కుమారుడు అకీరా నందన్‌.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్‌ స్కూల్లో చేరారు’’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఆ ట్వీట్‌ను కాసేపట్లోనే తొలగించారు. అయితే అప్పటికే ఆ ఫొటో స్ర్కీన్‌షాట్‌ల రూపంలో వైరల్‌ అయింది. దీంతో అభిమానులంతా అకీరాను బిగ్‌ స్ర్కీన్‌పై చూడనున్నామని సంబరపడుతూ…ఫొటోను షేర్‌ చేస్తున్నారు. తాజాగా దీనిపై రేణు దేశాయి ఘాటుగా స్పందించారు. ‘‘హాయ్‌ గయ్స్‌.. ప్రస్తుతానికి అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అతను అనుకోవడం లేదు. భవిష్యత్తులో తన నిర్ణయం, ఆలోచనా విధానం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఏదైనా పోస్ట్‌ చేసిన వెంటనే దానికి సంబంధించి ఊహాగానాలు ఆపేయండి. నిజంగా అకీరా సినిమాల్లోకి రావాలనుకుంటే ఆ విషయాన్ని నేను మీతో పంచుకుంటానని మాటిస్తున్నా’’ అని అన్నారు. రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోను రేణూ దేశాయి తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

పోస్ట్‌ చూసి ఊహాగానాలు చేయకండి!

పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) కుమారుడు అకీరా నందన్‌ (Akhiranandan) దర్శకుడు రాఘవేంద్రరావు, ఆయన మనవడు కార్తికేయతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే! కార్తికేయ, అకీరాతో దిగీన ఫొటో పంచుకున్న ఆయన ‘‘నాలుగో తరం అబ్బాయిలతో రాఘవేంద్రరావు(Raghavendra Rao) ’’ అని పేర్కొన్నారు. ‘నా మనవడు కార్తికేయ, పవన్‌ కుమారుడు అకీరా నందన్‌.. ఇద్దరూ అమెరికాలోని ఫిల్మ్‌ స్కూల్లో చేరారు’’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఆ ట్వీట్‌ను కాసేపట్లోనే తొలగించారు. అయితే అప్పటికే ఆ ఫొటో స్ర్కీన్‌షాట్‌ల రూపంలో వైరల్‌ అయింది. దీంతో అభిమానులంతా అకీరాను బిగ్‌ స్ర్కీన్‌పై చూడనున్నామని సంబరపడుతూ…ఫొటోను షేర్‌ చేస్తున్నారు.

తాజాగా దీనిపై రేణు దేశాయి ఘాటుగా స్పందించారు. ‘‘హాయ్‌ గయ్స్‌.. ప్రస్తుతానికి అకీరాకు నటనపై ఆసక్తి లేదు. హీరో కావాలని అతను అనుకోవడం లేదు. భవిష్యత్తులో తన నిర్ణయం, ఆలోచనా విధానం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఏదైనా పోస్ట్‌ చేసిన వెంటనే దానికి సంబంధించి ఊహాగానాలు ఆపేయండి. నిజంగా అకీరా సినిమాల్లోకి రావాలనుకుంటే ఆ విషయాన్ని నేను మీతో పంచుకుంటానని మాటిస్తున్నా’’ అని అన్నారు. రాఘవేంద్రరావుతో దిగిన ఫొటోను రేణూ దేశాయి తన ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

About The Author

Related Posts