Kalki 2898 AD: విశ్వనాయకుడి రాక… అదే కీలకం!

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగఅశ్విన్‌ (Nag ashwin) దర్శకత్వం వహిస్తున్న ‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD) చిత్రంలో కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రత్రి నాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే! దీపికా పడుకోన్‌ (Deepika Padukone) కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో కమల్‌ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. వచ్చేవారంలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో కీలక సన్నివేశాలు ఆయనపై తెరకెక్కించడానికి చిత్ర బృందం ప్లాన్‌ చేసిందట. ఈ షెడ్యూల్‌లో కమల్‌, అమితాబ్‌, ప్రభాస్‌ తదితరులు పాల్గొనున్నారని తెలుస్తోంది. కమల్‌ ప్రస్తుతం ‘భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ షెడ్యూల్‌కి బ్రేక్‌ ఇచ్చి.. ఈ చిత్రానికి డేట్లు సర్దుబాటు చేశారని టాక్‌. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తొలుత వైజయంతీ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు సినిమా విడుదల వేసవికి వెళ్తుందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను ప్రశ్నించగా ‘గ్రహాలు, నక్షత్రాలు ఎలా అనుకూలిస్తాయో చూడాలి’ అంటూ సమాధానమిచ్చారు. సినిమా ఎలా వస్తుందనే ప్రశ్నకు ‘ఓ కొత్త ప్రపంచాన్ని అయితే చూస్తారు’ అని చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ 70 శాతం పూర్తయిందని టాక్‌. కమల్‌ సన్నివేశాలు చిత్రీకరణ చేస్తే దాదాపు సినిమా పూర్తయినట్లేనట. ఈ షెడ్యూల్‌ సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది!

Kalki 2898 AD: విశ్వనాయకుడి రాక… అదే కీలకం!

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగఅశ్విన్‌ (Nag ashwin) దర్శకత్వం వహిస్తున్న ‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD) చిత్రంలో కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రత్రి నాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే! దీపికా పడుకోన్‌ (Deepika Padukone) కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో కమల్‌ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు. వచ్చేవారంలో రామోజీ ఫిల్మ్‌ సిటీలో కీలక సన్నివేశాలు ఆయనపై తెరకెక్కించడానికి చిత్ర బృందం ప్లాన్‌ చేసిందట. ఈ షెడ్యూల్‌లో కమల్‌, అమితాబ్‌, ప్రభాస్‌ తదితరులు పాల్గొనున్నారని తెలుస్తోంది. కమల్‌ ప్రస్తుతం ‘భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ షెడ్యూల్‌కి బ్రేక్‌ ఇచ్చి.. ఈ చిత్రానికి డేట్లు సర్దుబాటు చేశారని టాక్‌.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని తొలుత వైజయంతీ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు సినిమా విడుదల వేసవికి వెళ్తుందనే టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను ప్రశ్నించగా ‘గ్రహాలు, నక్షత్రాలు ఎలా అనుకూలిస్తాయో చూడాలి’ అంటూ సమాధానమిచ్చారు. సినిమా ఎలా వస్తుందనే ప్రశ్నకు ‘ఓ కొత్త ప్రపంచాన్ని అయితే చూస్తారు’ అని చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ 70 శాతం పూర్తయిందని టాక్‌. కమల్‌ సన్నివేశాలు చిత్రీకరణ చేస్తే దాదాపు సినిమా పూర్తయినట్లేనట. ఈ షెడ్యూల్‌ సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది!

About The Author

Related Posts