ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో సిరాజ్, గిల్

సెప్టెంబర్ నెలలో జరిగిన ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను టీమిండియా గెలుచుకోవడంలో గిల్ కీలకపాత్ర పోషించాడు. ఆసియా కప్‌లో 302 పరుగులు చేసిన గిల్ టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 74 పరుగులు, రెండో మ్యాచ్‌లో 104 పరుగులు చేశాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా గత నెలలో అదరగొట్టాడు. ఆసియా కప్ మొత్తంలో కేవలం 17.27 సగటుతో సిరాజ్ 11 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అయితే అద్భుతమే చేశాడు. ఒకే ఓవర్లో నాలుగో వికెట్లు తీయడంతోపాటు మ్యాచ్‌ మొత్తంలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. దీంతో శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలింది. అటు ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ కూడా గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చెలరేగాడు. రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో సత్తా చాటాడు. 54, 96, 127 పరుగులతో అదరగొట్టాడు

About The Author

Related Posts