క్రీడలు సమైక్యతకు చిహ్నం...
- 29 వ వార్డులో ఉత్సహాంగా ముగిసిన క్రీడలు
- సూర్ణపు సావిత్రమ్మ స్ఫూర్తితో
సంక్రాంతి సంబరాలు - గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు బహుకరణ
- మాజీ జాతీయ కోకో క్రీడాకారుడు, మా అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రమ్
మహబూబాబాద్ :
కులమత ప్రాంతీలకతీతంగా నిర్వహించే క్రీడా పోటీలు సమైక్యతకు చిహ్నంగా నిలుస్తాయని, గెలుపు ఓటమిలు సహజమని మాజీ జాతీయ కోకో క్రీడాకారుడు, మా అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రమ్ అన్నారు. 29 వ వార్డులో దివంగత ఐద్వా పట్టణ నాయకురాలు సుర్ణపు సావిత్రమ్మ స్మారకార్దంగా, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి క్రీడోత్సవాలు రెండు రోజులు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలలో 14 సంవత్సరాలలోపు బాలురకు కబడ్డీ, మహిళలకు కబడ్డీ, ముగులు, మ్యూజికల్ చైర్, తాడు ఆట పోటీలు నిర్వహించారు. మొదటి రోజు ఆటలు సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ప్రారంభించగా చివరి రోజు ఆటకు మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రమ్ టాస్ వేశారు. చివరి రోజు సోమవారం దైద సురేందర్ అధ్యక్షతన జరిగిన క్రీడల ముగింపు వేడుకలో పాల్గొని ఆయన మాట్లాడుతూ... పట్టణం నుండి గుమ్మనూరు ప్రాంతంలో గత 30 ఏళ్లుగా పండుగల సందర్భంగా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా రావడం అభినందనీయ మని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళామణులు రంగురంగుల ముగ్గులతో రంగవల్లులు అలంకరించడం ఈ ప్రాంత ప్రత్యేకత అన్నారు. కబడ్డీ పోటీలలో 14 సంవత్సరాల బాలురు అత్యంత ప్రతిభ చూపారని అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలకు మహిళల నుండి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. మహిళలు కూడా కబడ్డీ, తాడు ఆట, మ్యూజికల్ చైర్ లాంటి క్రీడా పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభను ఉత్సాహంగా చూపరని అన్నారు. ఆటలు అంతరించి పోతున్న తరుణంలో క్రీడలలో ప్రతిభ కనపరిచి ఆటలను బ్రతికించడం అభినందనీయమని అన్నారు. కన్న తల్లి జ్ఞాపకార్ధకంగా కూతుళ్లు స్వప్న, స్వరాజ్యం, కుమారుడు శ్రావణ్ లు ముందుకు వచ్చి ఇలాంటి క్రీడలు నిర్వహించడం పట్ల కుటుంబ సభ్యులని అభినందించారు. సావిత్రమ్మ భర్త, సిపిఎం నాయకులు సూర్ణపు సోమయ్య మాట్లాడుతూ...నా జీవిత భాగస్వామి జ్ఞాపకర్ధకంగా నిరంతరం క్రీడలు ప్రోత్సాహం చేస్తూ ఉంటామని పేర్కొన్నారు.
బహుమతులు ప్రధానం
