సాకారమైన చనాక` కొరాట ప్రాజెక్టు

అదిలాబాద్‌, సెప్టెంబర్‌ 30 ఆదిలాబాద్‌ జిల్లా రైతుల నాలుగు దశాబ్దాల కల సాకరమవుతోంది. జిల్లాలో నిర్మించిన చనాక` కొరాట ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌ గంగా నదిపై నిర్మించిన చనాక` కొరాట ప్రాజెక్టు వెటరన్‌ను అధికారులు రెండో రోజు విజయవంతంగా నిర్వహించారు. డ్రైరన్‌ను పూర్తి చేసిన అధికారులు.. తెల్లారే అంటే గురువారం రోజున వెట్‌రన్‌ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం రోజు సైతం వెట్‌రన్‌ సక్సెస్‌ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే బ్యారేజీ, గేట్ల నిర్మాణం పూర్తయింది. సైడ్‌వాల్స్‌ నిర్మాణ పనులను కూడా పూర్తిచేశారు. హత్తీఘాట్‌ వద్ద పంప్‌హౌజ్‌ నిర్మాణ పనులు కూడా కంప్లీట్‌ అయ్యాయి. ఇప్పటికే మొత్తంగా మూడు 5.5, మూడు 12 మెగావాట్ల మోటర్లను కూడా ఏర్పాటు చేశారు. 5.5 మెగావాట్ల మోటర్ల డ్రైరన్‌ను కూడా ఇటీవలే నిర్వహించారు.మరోవైపు.. కాలువల నిర్మాణాలు కూడా చకచకా సాగుతున్నాయి. లోయర్‌ పెన్‌గంగా కెనాల్‌కు సంబంధించి డీ14, డీ15, డీ16 కాలువలు పూర్తికాగా.. దాని కింద 5 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ సీజన్‌లోనే ఆ ఆయకట్టుకు నీరందించేందుకు అధికారులు అన్నిరకాలుగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే డ్రైరన్‌, వెట్‌ రన్‌ నిర్వహించగా.. అవి విజయవంతమయ్యాయి. త్వరలోనే ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.మహారాష్ట్ర సరిహద్దులోని జైనథ్‌ మండలం కొరాట వద్ద పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాక` కొరాట ప్రాజెక్టు వల్ల ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో ఏకంగా 52 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెట్‌రన్‌ విజయవంతం కాగా.. రైతులకు వానకాలం పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌ను నిర్మించి 5.5 మెగావాట్ల సామర్థ్యమున్న 3 మోటర్లు ఏర్పాటు చేయగా ఒక మోటార్‌ ద్వారా నీటిని కాలువలోకి వదిలారు. దీంతో.. నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల సాకరమైనట్టైంది.

సాకారమైన చనాక` కొరాట ప్రాజెక్టు

అదిలాబాద్‌, సెప్టెంబర్‌ 30
ఆదిలాబాద్‌ జిల్లా రైతుల నాలుగు దశాబ్దాల కల సాకరమవుతోంది. జిల్లాలో నిర్మించిన చనాక` కొరాట ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌ గంగా నదిపై నిర్మించిన చనాక` కొరాట ప్రాజెక్టు వెటరన్‌ను అధికారులు రెండో రోజు విజయవంతంగా నిర్వహించారు. డ్రైరన్‌ను పూర్తి చేసిన అధికారులు.. తెల్లారే అంటే గురువారం రోజున వెట్‌రన్‌ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం రోజు సైతం వెట్‌రన్‌ సక్సెస్‌ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే బ్యారేజీ, గేట్ల నిర్మాణం పూర్తయింది. సైడ్‌వాల్స్‌ నిర్మాణ పనులను కూడా పూర్తిచేశారు. హత్తీఘాట్‌ వద్ద పంప్‌హౌజ్‌ నిర్మాణ పనులు కూడా కంప్లీట్‌ అయ్యాయి. ఇప్పటికే మొత్తంగా మూడు 5.5, మూడు 12 మెగావాట్ల మోటర్లను కూడా ఏర్పాటు చేశారు. 5.5 మెగావాట్ల మోటర్ల డ్రైరన్‌ను కూడా ఇటీవలే నిర్వహించారు.మరోవైపు.. కాలువల నిర్మాణాలు కూడా చకచకా సాగుతున్నాయి. లోయర్‌ పెన్‌గంగా కెనాల్‌కు సంబంధించి డీ14, డీ15, డీ16 కాలువలు పూర్తికాగా.. దాని కింద 5 వేల ఎకరాలు ఉన్నాయి. ఈ సీజన్‌లోనే ఆ ఆయకట్టుకు నీరందించేందుకు అధికారులు అన్నిరకాలుగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే డ్రైరన్‌, వెట్‌ రన్‌ నిర్వహించగా.. అవి విజయవంతమయ్యాయి. త్వరలోనే ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.మహారాష్ట్ర సరిహద్దులోని జైనథ్‌ మండలం కొరాట వద్ద పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న చనాక` కొరాట ప్రాజెక్టు వల్ల ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాల్లో ఏకంగా 52 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వెట్‌రన్‌ విజయవంతం కాగా.. రైతులకు వానకాలం పంటలకు అవసరమైన సాగునీటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పంప్‌హౌస్‌ను నిర్మించి 5.5 మెగావాట్ల సామర్థ్యమున్న 3 మోటర్లు ఏర్పాటు చేయగా ఒక మోటార్‌ ద్వారా నీటిని కాలువలోకి వదిలారు. దీంతో.. నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా వాసుల కల సాకరమైనట్టైంది.

About The Author