జర్నలిస్టులు, పేద లాయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్

జర్నలిస్టులు, పేద లాయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి

హైదరాబాద్:

ప్రతిరోజూ కోర్టులకు హాజరయ్యే పేద న్యాయవాదులకు, మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే గౌరవ వేతనం చెల్లించాలని లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఎం. దశరథ్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

అందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వాలి

డెస్క్ జర్నలిస్టులతో పాటు ఫీల్డ్‌లో పనిచేసే విలేకరులందరికీ వివక్ష లేకుండా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని దశరథ్ నాయక్ కోరారు. అవినీతిని అరికట్టడంలో, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల రక్షణలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా జర్నలిస్టులు అనారోగ్యం బారిన పడుతున్నారని, వారి ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

పోలీసులకు జీతాలు పెంచాలి

పోలీసు శాఖలో హోంగార్డుల నుంచి ఎస్ఐ స్థాయి వరకు సిబ్బంది పగలు, రాత్రి కష్టపడుతున్నారని దశరథ్ నాయక్ పేర్కొన్నారు. వారి కష్టానికి తగ్గట్లుగా ప్రభుత్వ ఉద్యోగుల కంటే అధిక వేతనం చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. పేద లాయర్లు, జర్నలిస్టుల వృత్తిని గౌరవిస్తూ ప్రభుత్వం నెలవారీ భృతిని అందించాలని స్పష్టం చేశారు.

వరద నివారణ చర్యలు చేపట్టాలి
నగరంలో వర్షాకాలం రాకముందే ప్రభుత్వం అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, వర్షపు నీరు నిలవకుండా సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. ముందస్తు చర్యల ద్వారానే ప్రమాదాలను నివారించవచ్చని ఈ సందర్భంగా దశరథ్ నాయక్ పేర్కొన్నారు.

About The Author