అట్టహాసంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వారసుడి వివాహం
హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం:
అచ్చంపేట శాసనసభ్యుడు చిక్కుడు వంశీకృష్ణ కుమారుడి వివాహ వేడుక ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
సందడి చేసిన రాజకీయ ప్రముఖులు
ముఖ్యమంత్రితో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ వేడుకలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహ వేదిక వద్ద ముఖ్యమంత్రికి, మల్‌రెడ్డి రంగారెడ్డికి ఎమ్మెల్యే వంశీకృష్ణ కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి నూతన దంపతులకు అక్షతలు వేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
పెళ్లి వేడుక అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మరికొందరు కీలక నేతలతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. నియోజకవర్గాల అభివృద్ధి పనులు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. ఈ వేడుకలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
About The Author
04 May 2026
