ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్:
కొత్తపేట డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో నూతనంగా ప్రారంభమైన సన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూరాలజీ వైద్య సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి యూరాలజీ, నెఫ్రాలజీ వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా యూరాలజీ, కిడ్నీ సంబంధిత చికిత్సలు ఒకే వేదికపై ఆధునిక సదుపాయాలతో అందించబడటం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. వైద్యరంగంలో ఇటువంటి ప్రత్యేక సంస్థలు పెరగడం సమాజ ఆరోగ్యాభివృద్ధికి దోహదపడుతుందని వెల్లడించారు.ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సూర్య ప్రకాష్ వైద్య బృందాన్ని సుధీర్ రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక భారాస నాయకులు, ఇతర నాయకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
