పలు శుభకార్యాల్లో పాల్గొన్న మధుయాష్కి గౌడ్

వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్

పలు శుభకార్యాల్లో పాల్గొన్న  మధుయాష్కి గౌడ్

హైదరాబాద్:

 టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వివాహ, శుభకార్యాలకు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో రాజకీయ, సినీ ప్రముఖులతో కలిసి ఆయన సందడి చేశారు.

*ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం
బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని, సూర్యతేజ్‌ల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మధుయాష్కి గౌడ్, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.

తొలివెలుగు రఘు కుమార్తె వేడుకలో ప్రముఖులు
ఉప్పల్ పర్వతాపురంలోని స్పంజిల్లా క్లబ్ హౌస్‌లో 'తొలివెలుగు' ఛానల్ అధినేత రఘు కుమార్తె శ్రీయుక్త నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీగణేష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్లతో కలిసి మధుయాష్కి పాల్గొని చిన్నారిని దీవించారు.

నూతన వధూవరులకు ఆశీస్సులు
మన్నెగూడలోని బీఎంఆర్ సార్ధ కన్వెన్షన్‌లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కుమారుడు డాక్టర్ యశ్వంత్ - ఎలెన్ల వివాహ వేడుక నేత్రపర్వంగా జరిగింది. ఈ వివాహానికి విచ్చేసిన యాష్కి, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు.

జైత్ర హోటల్ ప్రారంభోత్సవం
వనస్థలిపురం పనామా చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన 'జైత్ర హోటల్'ను మధుయాష్కి గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి హోటల్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

About The Author