ఆపదలో అండగా ‘జై భవాని’ యూత్ –రక్తదానంతో ప్రాణాలకు బలమై నిలిచిన సేవా స్పూర్తి

  • అత్యవసర విజ్ఞప్తికి వెంటనే స్పందించిన యువత
  • 2008 నుంచి సేవా ప్రయాణం – 8,000 మందికి పైగా రక్తదానం
  • “ఎప్పుడైనా, ఎవరికి అయినా సహాయం” – యూత్ సభ్యుల హామీ

ఆపదలో అండగా ‘జై భవాని’ యూత్ –రక్తదానంతో ప్రాణాలకు బలమై నిలిచిన సేవా స్పూర్తి

వికారాబాద్ మే 3 భారత శక్తి 

ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, ప్రాణాలను కాపాడే మహోన్నత సేవగా నిలిచింది జై భవాని యూత్ అసోసియేషన్. శనివారం పట్టణంలోని ఒక ఆస్పత్రిలో అత్యవసరంగా రక్తం అవసరం ఉందని వచ్చిన సమాచారం మేరకు అసోసియేషన్ ప్రతినిధులు వెంటనే స్పందించి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా యూత్ సభ్యుడు వినోద్ మాట్లాడుతూ, “రక్తం అవసరమైన ప్రతి ఒక్కరికి మా అసోసియేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందనీ తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నాం” అని తెలిపారు. 2008లో ప్రారంభమైన ఈ యూత్ అసోసియేషన్ ఇప్పటివరకు సుమారు 8,000 మందికి పైగా రక్తదానం చేసినట్లు వెల్లడించారు.ఇక ముందు కూడా ఇదే సేవా కార్యక్రమాన్నికొనసాగిస్తామని, ఎవరికి అయినా రక్తం అవసరం ఉంటే వెంటనే సంప్రదించాలని సూచించారు. ఇందుకు సంబంధించి 8978897484, 9849648873 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
అదే విధంగా, ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న “ఫ్రెండ్స్ సపోర్ట్ బ్లడ్” యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రక్తదానానికి సంబంధించిన వివరాలను సులభంగా పొందవచ్చని తెలిపారు.ప్రాణాలను కాపాడే రక్తదానం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న జై భవాని యూత్ అసోసియేషన్ సేవలు ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తున్నాయిWhatsApp Image 2026-05-03 at 19.12.54

About The Author