వధూవరులను ఆశీర్వదించిన పారిజాత నర్సింహారెడ్డి దంపతులు

వధూవరులను ఆశీర్వదించిన పారిజాత నర్సింహారెడ్డి దంపతులు

బడంగ్పేట్:

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో ఆదివారం జరిగిన పలు వివాహ వేడుకలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు హాజరయ్యారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ కుమారుడి వివాహానికి హాజరు
మన్నెగూడలోని బీఎంఆర్ సార్థ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కుమారుడి వివాహ వేడుకకు పారిజాత నర్సింహారెడ్డి దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిలను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
నాదర్‌గుల్‌లో వేడుకలు
అనంతరం నాదర్‌గుల్ డివిజన్ పరిధిలోని బీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన మేఘన - అమరేందర్ ల వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నయనాచారి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-03 at 19.36.39

About The Author