నాలాపై కబ్జా 'షెడ్డు'.. పెట్రోల్ బంకు పక్కనే మృత్యు ఉచ్చు!

  • బడంగ్‌పేటలో బరితెగించిన అక్రమార్కులు.. నిబంధనలకు పాతర*
  • ఎస్.ఎన్.డి.పి నాలాపై పదుల సంఖ్యలో భారీ అక్రమ గిడ్డంగులు అక్రమ నిర్మాణాలు
  • ప్రమాదం పొంచి ఉన్నా టౌన్ ప్లానింగ్ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైనం*
  • శంషాబాద్ జోనల్ కమిషనర్, జిహెచ్ఎంసి కమిషనర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్..
  • హైడ్రాదృష్టి సాధించాలి...!

నాలాపై కబ్జా 'షెడ్డు'.. పెట్రోల్ బంకు పక్కనే మృత్యు ఉచ్చు!

బడంగ్పేట్:


నిబంధనలు గాలికి.. నిధులు బుడిదలో.. అధికార యంత్రాంగం నిద్రలో! బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆల్మాస్‌గూడలో అక్రమార్కులు బరితెగించారు. వరద నీటి మళ్లింపు కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన
SNDP (స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) నాలాను ఏకంగా కబ్జా చేసి భారీ షెడ్డు నిర్మాణానికి తెరలేపారు. అటు నీటి పారుదల శాఖ చట్టాలను, ఇటు అగ్నిమాపక భద్రతను తుంగలో తొక్కి సాగుతున్న ఈ అక్రమ దందా ఇప్పుడు స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ అక్రమ నిర్మాణానికి బడంగ్పేట్ మున్సిపాలిటీ నుండి ఇలాంటి అనుమతులు తీసుకోలేదు.. వ్రాత పూర్వక ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటో ఉన్నతాధికారులే చెప్పాలి.. 
ఈ ..ఎస్.ఎన్.డి.పి నాలపైన పెట్రోల్ పంప్ భారీ గిడ్డంగులు నిర్మాణం చేపట్టడం అధికారులు ముడుపుల మత్తులో జోగి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం, గతంలో ఈ ప్రాంతమంతా నీట మునిగి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పడవలో తిరిగిన పరిస్థితి, స్థానిక ఎమ్మెల్యే అయిన కళ్ళు తెరిచి అక్రమాలను, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారుWhatsApp Image 2026-05-03 at 18.55.27 (1)

నాలా మింగేస్తున్న 'తిమింగలాలు'

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలాల అభివృద్ధి పనులకు కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ఆల్మాస్‌గూడ ప్రధాన రహదారిపై నాలా పైభాగంలో ఎటువంటి అనుమతులు లేకుండానే పిల్లర్లు లేపి, భారీ విస్తీర్ణంలో షెడ్డు నిర్మిస్తున్నారు. కనీసం బఫర్ జోన్ వదలాలన్న నిబంధనను కూడా బేఖాతరు చేశారు. రేపు వర్షాకాలంలో ఈ నిర్మాణం వల్ల ప్రవాహం అగిపోతే, కిలోమీటర్ల మేర ఉన్న నివాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడం ఖాయమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

నిప్పుతో చెలగాటం!*
ఈ అక్రమ నిర్మాణం సాక్షాత్తు SPR ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ కు ఆనుకునే ఉండటం గమనార్హం. పెట్రోల్ బంకుల వద్ద కఠినమైన 'ఫైర్ సేఫ్టీ' నిబంధనలు అమలులో ఉండాలి. కానీ, ఎటువంటి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) లేకుండా, చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న ఈ షెడ్డులో ఏ చిన్న ప్రమాదం జరిగినా అది మహా విస్ఫోటనానికి దారితీసే అవకాశం ఉంది. వందలాది మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అధికారులారా.. మీ కళ్లు తెరవరా?
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత పెద్ద నిర్మాణం జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు 'చూడలేనట్లు' నటిస్తుండటం వెనుక భారీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 చట్టం ఏం చెబుతోంది?: అనుమతులు లేని నిర్మాణాలపై తెలంగాణ మున్సిపాలిటీ చట్టం-2019 ప్రకారం తక్షణమే కూల్చివేత చర్యలు చేపట్టాలి.

 బాధ్యులెవరు?: 
విధి నిర్వహణలో విఫలమైన అధికారులపై సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

'హైడ్రా' దృష్టికి అక్రమ దందా..
నాలా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న *హైడ్రా (HYDRA)* కమిషనర్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు సీనియర్ జర్నలిస్ట్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తక్షణమే నిర్మాణాన్ని నిలిపివేసి, కూల్చివేతలు చేపట్టకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో అధికారులు విఫలమైతే, వారిపైనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
*ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసి, బాధ్యులైన బిల్డర్లపై మరియు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్మాస్‌గూడ ప్రజలు కోరుతున్నారు.*WhatsApp Image 2026-05-03 at 18.55.27

About The Author