ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలు
- *బసవన్న విగ్రహానికి నివాళులర్పించిన రామ్మోహన్ గౌడ్*
- *వనస్థలిపురం రైతు బజార్ వద్ద కార్యక్రమం*
వనస్థలిపురం:
మహాత్మా బసవేశ్వర 893వ జయంతి వేడుకలను వనస్థలిపురంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో వీర శైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
*సమాజ సేవలో బసవన్న బాట..*
అనంతరం రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలను తొలగించి, కులరహిత సమాజ స్థాపనకు బసవేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన బోధనలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వనస్థలిపురం బసవేశ్వర సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మానెగారి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు దీపావళి శ్రవణ్ కుమార్, కుషాల్ కుమార్, విజయ్ పాటిల్, సంతోష్ కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు..jpeg)
