పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం
పోలీసుల సేవలు, త్యాగాలు విద్యార్థులకు స్ఫూర్తి
సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, భరోసా సేవలపై విద్యార్థులకు అవగాహన
పోలీసుల పనితీరు, సాంకేతిక పరికరాల పరిచయంతో విద్యార్థుల్లో ఉత్సాహం
జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
పోలీస్ అమరవీరుల దినం* (పోలీస్ ఫ్లాగ్ డే) వారోత్సవాల్లో భాగంగా, జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఈరోజు నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీన ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.వారికి పోలీసులు వినియోగించే ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, సైబర్ నేరాల గురించి, గంజాయి వాడకం పై కలిగే అనర్థాలు, పోలీసు విధులు,షీ టీమ్, భరోసా, సెక్యూరిటీ, ఆంటీ నార్కోటిక్ డ్రగ్, డాగ్ స్క్వాడ్ విభాగాల విధులు, ప్రజల రక్షణలో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాలు తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.
పోలీస్ స్టేషన్‌లో పని చేసే ప్రతి సిబ్బంది విధులు, బాధితులు పోలీస్ స్టేషన్‌కు ఎలా ఫిర్యాదు ఇవ్వాలి, ఆ ఫిర్యాదు తర్వాత ఏ శాఖ ఎలా విచారణ జరుపుతుందన్న అంశాలను విద్యార్థులకు వివరించారు. కొన్ని పరికరాల పనితీరును ప్రాక్టికల్‌గా చూపించారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ రాజేష్ మీన, విద్యార్థులకు ఆయుధాలు, పోలీస్ చట్టాలు, సీసీ కెమెరాల ప్రాధాన్యం, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు భద్రతా నిబంధనలు, సైబర్ నేరాల అవగాహన అంశాలను వివరిస్తూ మార్గదర్శనం చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ — పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చట్టాన్ని గౌరవిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, సైబర్ నేరాల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
బాలికల రక్షణకు ఏర్పాటు చేసిన భరోసా కేంద్రం సేవలు, గంజాయి/డ్రగ్స్ ప్రమాదాలు, డయల్ 100, సైబర్ నేరం ఫిర్యాదు నంబర్ 1930 వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీన, తో పాటు రూరల్ ఇన్స్పెక్టర్, ఆర్ ఐ రమేష్,ఎస్ఐలు,ఏఆర్ సిబ్బంది, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
