లక్షల డప్పులు, వేల గొంతుల సభను జయప్రదం చేయండి:భద్రాద్రి జిల్లా కార్యదర్శి కొమ్ము హుస్సేన్ మాదిగ
మణుగూరు, ఫిబ్రవరి 03 (భారతశక్తి): ఎస్సి వర్గీకరణకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు లక్షల డప్పులు, వేల గొంతుకలు హలో మాదిగ ఛలో హైదరాబాద్ ప్రదర్శన ను జయప్రదం చేయాలని భద్రాద్రి జిల్లా కార్యదర్శి కొమ్ము హుస్సేన్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో కొమ్ము హుస్సేన్ మాదిగ ఆధ్వర్యంలో లక్షల డప్పులు, వేల గొంతులు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో ఎస్సి వర్గీకరణ వెంటనే అమలు చేసి 59 కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7న జరిగే లక్షల డప్పులు, వేల గొంతులు ప్రదర్శనలో మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ, బోయళ్ళ నరసింహారావు మాదిగ, చిట్యాల రజిత మాదిగ, చెక్క రమేష్ మాదిగ, రాజు, మాట్ల బాబన్న మాదిగ, అధ్యక్షులు మోదుగు వెంకటేశ్వర్లు మాదిగ, పొడుతూరి కళ్యాణి మాదిగ, మంద కృష్ణ మాదిగ, మోదుగు తిరుపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు, ఫిబ్రవరి 03 (భారతశక్తి): ఎస్సి వర్గీకరణకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు లక్షల డప్పులు, వేల గొంతుకలు హలో మాదిగ ఛలో హైదరాబాద్ ప్రదర్శన ను జయప్రదం చేయాలని భద్రాద్రి జిల్లా కార్యదర్శి కొమ్ము హుస్సేన్ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయంలో కొమ్ము హుస్సేన్ మాదిగ ఆధ్వర్యంలో లక్షల డప్పులు, వేల గొంతులు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో ఎస్సి వర్గీకరణ వెంటనే అమలు చేసి 59 కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7న జరిగే
లక్షల డప్పులు, వేల గొంతులు ప్రదర్శనలో మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బోయిళ్ళ వెంకటేశ్వర్లు మాదిగ, బోయళ్ళ నరసింహారావు మాదిగ, చిట్యాల రజిత మాదిగ, చెక్క రమేష్ మాదిగ, రాజు, మాట్ల బాబన్న మాదిగ, అధ్యక్షులు మోదుగు వెంకటేశ్వర్లు మాదిగ, పొడుతూరి కళ్యాణి మాదిగ, మంద కృష్ణ మాదిగ, మోదుగు తిరుపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
