కీసర సర్కిల్... పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి సహకరించండి.

  • కమీషనర్ కు వినతి పత్రం సమర్పణ.
  • సీనియర్ నాయకులు సంగోది పరమేష్ కుమార్

కీసర సర్కిల్... పరిధిలోని ప్రాంతాల అభివృద్ధికి సహకరించండి.

జవహర్ నగర్:

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని యాప్రాల్, అమ్ముగూడ సీనియర్ నాయకులు సంగోది పరమేష్ కుమార్ పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని సోమవారం సంగోది పరమేష్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు కమీషనర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పరమేష్ కుమార్ మాట్లాడుతూ యాప్రాల్ అమ్ము గూడా పరిధిలోని హిందూ స్మశాన వాటిక అభివృద్ధి గురించి, కీసర సర్కిల్ పరిధిలోని వివిధ వార్డులను అభివృద్ధి పథంలోకి ముందుకు తీసుకెళ్లే విధంగా సమగ్ర ప్రణాళికలు తయారుచేసి సర్కిల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమ్ముగూడ, యాప్రాల్ పరిధిలో వీధి దీపాలు , డ్రైనేజీ సమస్య, నీటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని కోరారు. నాయకుల సమస్యలు విన్న కమిషనర్ సానుకూలంగా స్పందించారని పరమేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారి మహేష్ కుమార్, వెంకట జయసింహ, విశాల్ భీమ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author