శేరిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు

  • * వార్షికోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
  • * కెసిఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాలలో కుల సంఘాలకు నిధులు మంజూరు
  • * అమ్మవారి దివ్య ఆశీస్సులతో అందరూ బాగుండాలి
  • * ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి

శేరిపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలు

గజ్వేల్:

పెద్దమ్మ తల్లి దయతో తెలంగాణ రాష్ట్రలో అలాగే శేరిపల్లి గ్రామంలో వర్షాలు సంవృద్ధిగా కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని ఆ జగన్మాతను కోరుకున్నామని, గత బిఅరెస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసి, ఎన్నో నిధులను మంజూరు చేసారని ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శేరిపల్లి గ్రామంలో ముదిరాజుల కుల దైవం పెద్దమ్మ తల్లి ఆలయ త్రుతీయ వార్షికోత్సవం వేడుకలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ నేతృత్వంలో ఘనంగా నిర్వహింస్తున్నారు, గ్రామ పెద్దల పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఎంతో మహిమాన్విత మైన దేవతా అని, ఆలయ ప్రాంగణంలో సుమారు మూడు లక్షల రూపాయలతో సీసీ పోయించామని, అలాగే శేరిపల్లి గ్రామం ప్రధాన కూడలిలో ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయించామని, రాబోవు రోజుల్లో శేరిపల్లి గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఆలయ కమిటీ అధ్యక్షులు మోతేకాని కుమార్, శేరిపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మోతేకాని శ్రీరామ్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం రోజున గ్రామ దేవత పోచమ్మ తల్లికి, బోనాలు సమర్పించామని, సోమవారం రోజు పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా జరిపామని, మహిళా మణులచే అమ్మవారికి ఒడి బియ్యం పోయాడం జరిగిందని, అలాగే ఇదే రోజున పెద్దమ్మ తల్లికి బోనాల సమర్పిస్తామని, మంగళవారం రోజున అమ్మవారికి గావురంగాల కార్యక్రమంలో ఉంటుందని తెలిపారు, పెద్దమ్మ తల్లి దయతో గ్రామంలో వర్షాలు సంవృద్ధి గా కురిసి పాడి పంటలు పుష్కలంగా పండాలని ఆ జగన్మాతను కోరుకున్నామని తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ఆర్దిక రూపేణా, వస్తూ రూపేణా సహకరించిన దాతలకు, ముదిరాజ్ కులస్తులకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కర్రె కనకయ్య, ప్రధాన కార్యదర్శి జిన్నా చంద్రం, కోశాధికారి బోయిని నర్సింలు, ముదిరాజ్ సంఘ నాయకులు, కులస్తులు, గ్రామ యువకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-20 at 19.41.27 (1)

About The Author