చికెన్, కోడిగుడ్లు తినండి, ఇమ్యూనీటి పెంచుకోండి: జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 7(భారత శక్తి): ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కోళ్ళ వైరస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందీ లేదని, ఈ వైరస్ ఏమిటో ఇంకా గుర్తించలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ వి. రవీందర్ చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకటీ రెండు చోట్ల కోళ్ల ఫారాళ్లో ఏర్పడిన వైరస్ వలన ఇబ్బంది అయిందే తప్ప మిగతా అంతటా బాగానే ఉందనీ తప్పుడు ప్రచారాలు, వదంతులు నమ్మవద్దనీ, తెలంగాణ లో వైరస్ ప్రభావం లేదనీ, పౌల్ట్రీ పరిశ్రమ బాగానే ఉందన్నారు. చికెన్ ను వేడి చేసిన తర్వాత తింటామని, కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదనీ చెప్పారు. ప్రజలందరి అందరూ చికెన్, కోడి గుడ్లు తినాలనీ,ఇమ్యూనీటి (వ్యాధి నిరోధక శక్తి) పెంచుకోవాలన్నారు. 100 గ్రాముల చికెన్ తింటే 27 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందనీ, తక్కువ ధరలో లభించేది చికెన్, కోడి గుడ్లు మాత్రమేనని, పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమని చెప్పారు. తరుచు కోళ్ల ఫారలను శానిటేషన్ చేసుకోవాలి, కొత్త వ్యక్తుల్ని ఫారం దగ్గరికి రానివ్వకూడదనీ స్పష్టం చేసారు. కోళ్ల దానాలో మక్కలు, సోయా, మినరల్ ఉంటాయనీ, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కోళ్ల వాహనాలను చెక్ చేసిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని చెప్పారు.

చికెన్, కోడిగుడ్లు తినండి, ఇమ్యూనీటి పెంచుకోండి: జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 7(భారత శక్తి):
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన కోళ్ళ వైరస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎలాంటి ఇబ్బందీ లేదని, ఈ వైరస్ ఏమిటో ఇంకా గుర్తించలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ వి. రవీందర్ చెప్పారు. నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకటీ రెండు చోట్ల కోళ్ల ఫారాళ్లో ఏర్పడిన వైరస్ వలన ఇబ్బంది అయిందే తప్ప మిగతా అంతటా బాగానే ఉందనీ
తప్పుడు ప్రచారాలు, వదంతులు నమ్మవద్దనీ,
తెలంగాణ లో వైరస్ ప్రభావం లేదనీ, పౌల్ట్రీ పరిశ్రమ బాగానే ఉందన్నారు. చికెన్ ను వేడి చేసిన తర్వాత తింటామని, కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదనీ చెప్పారు. ప్రజలందరి అందరూ చికెన్, కోడి గుడ్లు తినాలనీ,ఇమ్యూనీటి (వ్యాధి నిరోధక శక్తి) పెంచుకోవాలన్నారు. 100 గ్రాముల చికెన్ తింటే 27 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందనీ, తక్కువ ధరలో లభించేది చికెన్, కోడి గుడ్లు మాత్రమేనని, పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమని చెప్పారు.
తరుచు కోళ్ల ఫారలను శానిటేషన్ చేసుకోవాలి, కొత్త వ్యక్తుల్ని ఫారం దగ్గరికి రానివ్వకూడదనీ స్పష్టం చేసారు. కోళ్ల దానాలో మక్కలు, సోయా, మినరల్ ఉంటాయనీ, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కోళ్ల వాహనాలను చెక్ చేసిన తర్వాతనే అనుమతి ఇవ్వాలని చెప్పారు.

About The Author