హయత్‌నగర్ సర్కిల్‌లో జనగణన శిక్షణ ప్రారంభం
తొలి విడతలో 38 మంది సూపర్వైజర్లు, 235 మంది ఎన్యూమరేటర్ల నియామకం
హయత్‌నగర్:
జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా హయత్‌నగర్ సర్కిల్‌లో మొదటి దశ శిక్షణ తరగతులు మంగళవారంతో ముగిశాయి. మే 11 నుంచి జూన్ 9 వరకు జరగనున్న గృహ గణన, ఇళ్ల జాబితా రూపకల్పన కోసం ప్రభుత్వం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉద్యోగులను ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించింది. హయత్‌నగర్ సర్కిల్ పరిధిలో మొత్తం 38 మంది సూపర్వైజర్లు, 235 మంది ఎన్యూమరేటర్లను ఈ విధులకు కేటాయించారు.
మూడు రోజుల పాటు శిక్షణ*
బి.ఎన్. రెడ్డి నగర్, చింతలకుంట, వనస్థలిపురం వార్డులకు చెందిన సిబ్బందికి హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 18, 20, 21 తేదీల్లో మొదటి బ్యాచ్ శిక్షణ ఇచ్చారు. జనగణన సమయంలో గృహాల వివరాలను నమోదు చేసే విధానం, ఫారాలను పూర్తి చేసే తీరుపై ఫీల్డ్ ట్రైనర్లు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో చార్జ్ జనగణన అధికారి, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ దినేష్ సింగ్ పాల్గొన్నారు. వీరితో పాటు:
ఇంచార్జి అసిస్టెంట్ కమిషనర్లు: నర్సింగ్ రావు, వెంకన్న.
ఫీల్డ్ ట్రైనర్లు: సాయి తరుణ్, కనకయ్య, మల్లికార్జున్, విఘ్నేశ్వరి, లక్ష్మీ దీపక్, శైలజ.
టాక్స్ ఇన్‌స్పెక్టర్లు: సుధాకర్, నాగయ్య, ఆయూబ్ ఖాన్, జాహీద్, ఆంజనేయులు.
బిల్ కలెక్టర్లు: శివరాజ్, విశ్వజిత్ రెడ్డి, శిరీష యాదవ్, అర్చన, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నిర్దేశించిన సమయంలోగా పక్కాగా గణన పూర్తి చేయాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు.
.jpeg)
About The Author
22 Apr 2026
