వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు

వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

WhatsApp Image 2025-09-15 at 6.57.29 PM

వికలాంగుల పింఛను రూ 6000 పెంచాలి. వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత,గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారులకు రూ 4000 పెన్షన్ పెంచాలి. ఇప్పటికే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలి.
పై విషయమై తమతో మనవి చేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ 4000 నుండి రూ 6000/- పెంచుతామని, అలాగే వృద్ధులు వితంతువులు, బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ 2000/-నుండి రూ 4000/- పెంచుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదు.ఇది ఘోరమైన మోసం.అంగవైకల్యం, నిస్సహాయ స్థితి, నిరాదరణ వల్ల ఇప్పటికే ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు, వృద్ధులు, వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం.

Read More ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన పెయింటింగ్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు

పక్క రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి, సరైన సమయానికి పెన్షన్ ఇస్తున్నారు. తెలంగాణలో పెన్షన్ పెరగక పోవడం వల్ల పెన్షన్ దారులు అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి వెంటనే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం.

Read More పేదలకు ఆరోగ్య భరోసా

ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు, వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బురుగుల రాజు, భోజరెడ్డి, నర్సారెడ్డి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు నందు, సంజు తదితరులు పాల్గొన్నారు.

Read More ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుని ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

About The Author