ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
తుర్కయంజాల్:
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. "ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక"లో భాగంగా తుర్కయంజాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
గడపగడపకూ సంక్షేమ పథకాలను చేరవేయడమే లక్ష్యం.
ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడమే ప్రజాపాలన ఉద్దేశ్యం.
అంబేద్కర్ చౌరస్తాలో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతాను.
About The Author
01 May 2026
