బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి: మధుయాష్కి గౌడ్

బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి: మధుయాష్కి గౌడ్

వనస్థలిపురం:

 కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు డివిజన్ అధ్యక్షులు కృషి చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం వనస్థలిపురంలోని పార్టీ కార్యాలయంలో ఎల్బీనగర్ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు పలు కీలక సూచనలు చేశారు:
 * సంక్షేమ పథకాల ప్రచారం:* ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి.

 ఇందిరమ్మ ఇళ్లు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో డివిజన్ అధ్యక్షులు భాగస్వామ్యం వహించి, నిజమైన అర్హులకు ఫలాలు అందేలా చూడాలి.

 *ఓటర్ల జాబితా: త్వరలో జరగనున్న ఓటర్ల నమోదు ప్రక్రియ (ఎస్ఐఆర్)పై ప్రత్యేక దృష్టి సారించాలి. ఓట్ల తొలగింపు, కొత్త చేర్పుల విషయంలో బూత్ స్థాయి ఏజెంట్లు నిబద్ధతతో పనిచేయాలి.
ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు మకుటం సదాశివుడు, శ్రీపాల్ రెడ్డి, బండా సురేందర్ రెడ్డి, డి.శశిధర్ రెడ్డి, బుడ్డా సత్యనారాయణ, లింగాల కిషోర్ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, మంజుల రెడ్డి పాల్గొన్నారు. అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, నేలపాటి రామారావు, మెగావత్ గణేష్ నాయక్, నాయకులు తులసి శ్రీనివాస్, భీమిడి రామకృష్ణారెడ్డి, డేరంగుల కృష్ణ, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, దాము మహేందర్ యాదవ్, కొండోజు శ్రీనివాస్, రిజ్వాన్, శ్రీనాథ్ తదితరులు హాజరయ్యారు.

About The Author