అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు
కొనియాడిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్:
సమాజంలో కుల వ్యవస్థ, వర్ణ వివక్ష,లింగ వివక్షలను గట్టిగా వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు అని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కొనియాడారు. సోమవారం వనస్థలిపురంలోని సంపూర్ణ డబల్ బెడ్ రూమ్ వద్ద వనస్థలిపురం వీరశైవ లింగయత్ సమాజం అధ్యక్షులు దీపావళి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో
నిర్వహించిన వారి 893వ జయంతి ఉత్సవాల సందర్భంగా బసవేశ్వరుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, వారు 1134 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బాగేవాడిలో మాదిరాజు,మాదలంబిక దంపతులకు బసవేశ్వరుడు జన్మించారని తెలిపారు.వేద పండితుల కుటుంబంలో జన్మించిన ఆయన,కళ్యాణ రాజధానిలో ప్రధానమంత్రిగా పనిచేసి సమాజ సేవలో విశేష పాత్ర పోషించారని చెప్పారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బసవేశ్వరుడు చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు.చిన్ననాటి నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని, అంటరానితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేసి,మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేశారని వివరించారు.ఇట్టి కార్యక్రమంలో చింతల రవికుమార్, ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్, కిరణ్ కుమార్, నాయకులు సంఘ సభ్యులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
