ఓటర్ల నమోదు ప్రక్రియపై పొలిటికల్ ఏజెంట్లకు శిక్షణ
ఎల్.బి. నగర్ సర్కిల్-13 పరిధిలో జూన్ 25 నుంచి 'ఎస్ఐఆర్'
ఎల్.బి. నగర్:
ఎల్.బి. నగర్ సర్కిల్-13 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణా కార్యక్రమం బుధవారం సరూర్‌నగర్‌లోని జ్యోతి క్లబ్‌లో జరిగింది. జూన్ 25 నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల నమోదు/సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ఏజెంట్లకు అవగాహన కల్పించేందుకు సర్కిల్-13 ఏఈఆర్ఓ, డీసీ బి. శ్రీనివాస్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
*ప్రత్యేక ఓటర్ల నమోదుపై అవగాహన
ఈ సందర్భంగా డీసీ బి. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయడంలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. అనంతరం ఏజెంట్లు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు (ఏఎల్ఎంటీ) సురేష్, విక్రమార్క పాల్గొని ఓటర్ల నమోదు ప్రక్రియపై క్షేత్రస్థాయి సాంకేతికతను, నిబంధనలను ఏజెంట్లకు వివరించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో సర్కిల్-13 ఏఎంసీలు ఎం.ఏ. ఖదీర్, ఎం. చంద్రశేఖర్‌తో పాటు ఐఎన్‌సీ, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన సుమారు 150 మంది బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు.

