సరూర్ సర్కిల్ పరిధిలో సర్ పై బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం విజయవంత
ఎల్బీనగర్:
సరూర్ నగర్ సర్కిల్ నెం.12 పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లకు (బిఎల్ఏ) ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమం గురువారం సరూర్ నగర్ సర్కిల్ చైతన్యపురి డివిజన్ మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్‌లో విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి సరూర్ నగర్ సర్కిల్ నెం.12 డిప్యూటీ కమిషనర్, ఏఈఆర్ఓ శ్రీకాంత్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ ఏజెంట్లకు సర్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, బూత్ స్థాయిలో బిఎల్ఏలు నిర్వహించవలసిన బాధ్యతలు మరియు ఎన్నికల సంఘం మార్గదర్శకాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, ఎన్నికల విభాగం సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
About The Author
26 Jun 2026
