డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం విద్యార్థుల్లో అవగాహన

యాలాల జెడ్పీహెచ్‌ఎస్‌లో వ్యాసరచన, కబడ్డీ పోటీలు నిర్వహించిన పోలీసులు

డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం విద్యార్థుల్లో అవగాహన

తాండూరు:

డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనలో భాగంగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు యాలాల పోలీసులు బుధవారం యాలాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలకు వ్యాసరచన మరియు కబడ్డీ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విజేతలకు యాలాల ఎస్సై విఠల్ రెడ్డి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్సై విఠల్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. తమతో పాటు తమ స్నేహితులు, తోటి విద్యార్థులు కూడా డ్రగ్స్ అనే భూతానికి అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు ఆర్థిక, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తారని, మంచి అలవాట్లు అలవరుచుకుని భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్రామేశ్వర్, రవీందర్ రెడ్డి, పీడీ రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ఏఎస్సై రామచందర్, హెడ్ కానిస్టేబుళ్లు నర్సిములు, జగదీష్, మహిళా పోలీస్ కానిస్టేబుల్ అనురాధతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.WhatsApp Image 2026-06-24 at 20.04.22 (1)

About The Author