19 వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాలి

జీవో 46ను రద్దు చేయాల్సిందే : బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

19 వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాలి

ఎల్బీనగర్,

దిల్ సుఖ్ నగర్ లో నిరుద్యోగులతో బీజేపీ ఎమ్మెల్యే స్థానిక నాయకులు సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, జీవో 46 వల్ల పోలీసు నియామకాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో సరి పెట్టకుండా 19 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది పోలీసు అభ్యర్థులు, 30 లక్షల మంది నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్యపై డిక్లరేషన్​ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని పోస్టులు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  డీజీపీ 19 వేల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతుంటే ప్రభుత్వం మాత్రం 5 వేల పోస్టుల గురించే మాట్లాడుతుందని ఆయన విమర్శించారు. అభ్యర్థులకు 35 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఇవ్వడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒకే కటాఫ్ అమలు చేయాలని, తెలంగాణ యువతను నాన్-లోకల్‌గా పరిగణించే పరిస్థితి ఎలా వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జీవో 46ను సవరిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని తప్పు బట్టారు. నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని, అవసరమైతే అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. నిరుద్యోగులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్​, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, అనితా రెడ్డి, భూక్యా కుమార్, ఆకాశ్​, సంధ్య, నవీన్ పట్నాయక్, శింబు నాయక్, నవీన్ గౌడ్, ప్రత్యూష తదితర నిరుద్యోగులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-25 at 19.58.29

About The Author