భాగ్యనగరంలో కమల వికాసం ఖాయం: కుటుంబ, అవినీతి రాజకీయాల నుంచి తెలంగాణకు విముక్తి
- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీస్థాయిలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం..
- *జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి స్థానిక ఎన్నికలే లక్ష్యంగా శ్రేణులకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం.
హైదరాబాద్:
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుల సమ్మేళనం పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధిలోని బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు ఈ సమావేశానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాబోయే రోజుల్లో ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, హైదరాబాద్ ఎప్పటికీ బీజేపీకి కంచుకోట అని నాయకత్వం స్పష్టం చేసింది.
*హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అడ్డాగా మారింది: ఎన్. రామచందర్ రావు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సమ్మేళనంలో మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై, గత బీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
*వరదలు - మౌలిక వసతుల లేమి: గత బీఆర్ఎస్ పాలనలో భారీ వర్షాలకు నగరం మునిగిపోతే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో చిన్నపాటి వానలకే రోడ్లు జలమయం అవుతున్నాయని, కరెంట్ షాక్‌లతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
*దొంగ ఓట్ల కుట్రలపై పోరాటం: రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారుల దొంగ ఓట్లతో హైదరాబాద్‌ను కైవసం చేసుకోవాలని ఎంఐఎం కుట్రలు చేస్తోందని, బూత్ స్థాయి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఈ పన్నాగాన్ని అడ్డుకోవాలని స్పష్టం చేశారు.
*కార్యకర్తలే పార్టీకి అసలైన బలం: నితిన్ నబిన్
ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దిశానిర్దేశం చేశారు.
*అధికారం సేవకే సాధనం: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలనతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని, అధికారం అనేది ప్రజలపై పాలించడానికి కాదు, సేవ చేయడానికి మాత్రమేనని నిరూపించారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విజన్‌ను ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ రూపంలో మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తుచేశారు.
*తెలంగాణతో అనుబంధం చారిత్రకం:తెలంగాణకు బీజేపీ కొత్త పార్టీ కాదని, 1984 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పార్టీకి ఇద్దరు ఎంపీలు గెలిస్తే, అందులో ఒకరు తెలంగాణ ప్రాంతం నుంచే ఎన్నికయ్యారని చరిత్రను గుర్తుచేశారు. తెలంగాణ సాధన కోసం పార్లమెంట్‌లో సుష్మా స్వరాజ్ (చిన్నమ్మ) చేసిన కృషిని, బీజేపీ కార్యకర్తల త్యాగాలను స్మరించుకున్నారు.
*యువతకు కాంగ్రెస్ మోసం: రెండు లక్షల ఉద్యోగాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతను వంచించిందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుని అవినీతికి పాల్పడితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అవినీతిపరులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
*కేడర్‌కు జాతీయ నాయకత్వం త్రివిధ సంకల్పాల పిలుపు
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి బూత్ అధ్యక్షుడు, కార్యకర్త మూడు ముఖ్యమైన సంకల్పాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నితిన్ నబిన్ పిలుపునిచ్చారు:
1.ఇంటింటికీ బీజేపీ: ప్రతి కుటుంబం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీ సిద్ధాంతాలను వివరించాలి.
2.ఓటరు జాబితా నమోదు:ప్రతి ఓటరును సంప్రదించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలి.
3.లబ్ధిదారుల అనుసంధానం: కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలిసి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలి.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు పలువురు సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కమలం గుర్తును విజయతీరాలకు చేర్చడానికి ఉమ్మడిగా శ్రమించాలని శ్రేణులను కోరారు..jpeg)
