రాహుల్ గాంధీ కనబడుటలేదు' దేశ రాజధానిలో పోస్టర్ల కలకలం
లోక్‌సభ ప్రతిపక్ష నేత విదేశీ పర్యటనలపై దుమారం.. అధికార, ప్రతిపక్షాల మధ్య పీక్‌కు చేరిన రాజకీయ యుద్ధం!
న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఒక అనూహ్య పరిణామం తీవ్ర రాజకీయ సంచలనానికి తెరలేపింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ‘కనిపించడం లేదు’ (మిస్సింగ్) అంటూ నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో వెలిసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ తాజా విదేశీ పర్యటనను లక్ష్యంగా చేసుకుని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధంలో ఈ పరిణామం సరికొత్త మలుపు తిప్పింది.
*ప్రధాన కూడళ్లలో ప్రత్యక్షమైన పోస్టర్లు
ఢిల్లీలోని ప్రసిద్ధ ఫిరోజ్‌షా రోడ్డు, ఐటీఓ, మండి హౌస్ వంటి పలు ప్రధాన కూడళ్లు, వీధుల్లో రాహుల్ గాంధీ ఫొటోతో కూడిన ‘మిస్సింగ్’ పోస్టర్లు రాత్రికి రాత్రే ప్రత్యక్షమయ్యాయి. అయితే ఈ వివాదాస్పద పోస్టర్లను ఎవరు అంటించారనేది ప్రస్తుతానికి అధికారికంగా స్పష్టంగా తెలియరాలేదు. పార్లమెంట్ సమావేశాలు, కీలక ఎన్నికలు లేదా పార్టీ అంతర్గత ప్రాముఖ్యత కలిగిన సమయాల్లో రాహుల్ గాంధీ దేశంలో ఉండరంటూ శనివారం నుంచే బీజేపీ తన విమర్శల పదును పెంచిన మరుసటి రోజే ఈ పోస్టర్లు కలకలం రేపడం గమనార్హం.
"ఆయన లోక్‌సభ ప్రతిపక్ష నేత కాదు.. ‘టూరిజం లీడర్’!".jpeg)
*విమర్శలు-ప్రతివిమర్శల పర్వం
పార్లమెంట్ నడుస్తున్నప్పుడు లేదా దేశానికి, సొంత పార్టీకి ఆయన అవసరం ఉన్నప్పుడల్లా విదేశాలకు వెళ్లడం రాహుల్‌కు అలవాటుగా మారిందని పూనావాలా ఆరోపించారు. ప్రజల కంటే ఆయన టూరిజానికే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఈ పోస్టర్ల ఉదంతంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే అధికార పక్షం ఇటువంటి చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ప్రతిపక్ష నేత ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ కుట్ర పన్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ పోస్టర్ల వివాదం రానున్న రోజుల్లో పార్లమెంట్ లోపల, బయట మరింత హీట్ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి..jpeg)

