ఇప్పుడూ జమలీ లేనట్టే
వన్ నేషన్ ? వన్ ఎలక్షన్ కు అందరూ రెడీ అయిపోయారు. కానీ కేంద్రం మాత్రం వెనుకడుగు వేసింది. ఇప్పుడల్లా సాధ్యం కాదని లా కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్లుగా ప్రకటించేసింది. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కష్టమే అని రామ్ నాథ్ కోవింద్ కమిటీకి నివేదిక సమర్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. జమిలి ఎన్నికలపై రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక పై లా కమిషన్ సెప్టెంబర్ 27న సమావేశమైంది. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఢల్లీి వేదికగా జరిగిన ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ చర్చిస్తోంది. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే కేంద్రం తదుపరి కార్యాచరణ ఉండనుంది. అయితే ఈ కమిటీకి కాలపరిమితిలేదు. అందుకే ఎప్పుడు నివేదిక ఇస్తుందో స్పష్టత లేదు. అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమవుతుందా లేదా ఈ కమిటీ నిర్ణయించనుంది. ఈ కమిటీకి లా కమిషన్ చేసే సిఫార్సులు కీలకం కానున్నాయి. ఏకకాల ఎన్నికలపై లా కమిషన్ నివేదిక 2024 ఎన్నికలలోపు వెలువడుతుందని భావిస్తున్నారు. భారతదేశంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను ఓకే చేసేందుకు లా కమిషన్ రాజ్యాంగ సవరణలను సూచించనుంది. 2024 ఎన్నికలకు ముందు ఒకే దేశం, ఒకే ఎన్నికలను తీసుకురావడం సాధ్యం కాదని కమిషన్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సూచనలను పొందుపరిచేందుకు ఓ రిపోర్ట్‌ను తీసుకురావాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై లా కమిషన్ నివేదిక ప్రత్యేకంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. అన్ని స్థాయిల ఎన్నికలు ఒకే సారి నిర్వహించాలంటే లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారాలు చూపడం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై లా కమిషన్ ఇలా చెప్పింది.. ‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్‌పై నివేదికను ఖరారు చేయడానికి సంబంధించి సంప్రదింపుల కోసం మరికొన్ని సమావేశాలు అవసరం. కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రక్రియను సులభతరం చేస్తాయని తాము నమ్ముతున్నాము..’’ అంది.‘‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి, ప్రజలు తమ నాయకులను మరింత తెలివిగా ఎన్నుకుంటారు. ఎందుకంటే ఎన్నికలు తగినంత సమయం తర్వాత జరుగుతాయి. అందువల్ల ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయరు.. బదులుగా, మేము దీన్ని మరింత అవగాహనతో చేస్తాములోక్‌సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాలపై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం సెప్టెంబర్ 2న ఒక కమిటీని ఏర్పాటు చేసింది.ఇందులో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ ఉన్నారు. కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి. అయితే ఈ కమిటీలో చేరేందుకు అధిర్ రంజన్ చౌదరి నిరాకరించారు.ఈ కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23న జరిగింది. ఈ సమావేశంలో ఇతర పార్టీల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై సూచనలు చేసేందుకు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్రాల్లోని అధికార పార్టీలు, పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం ఉన్న పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది.ఏదైనా ఒక్క సారే ఎన్నికలు పెట్టగలరు కానీ.. తర్వాత మళ్లీ.. మధ్యలో ఎన్నికలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని.. భారత ప్రజాస్వామ్యంలో ఉపఎన్నికలు? మధ్యంతర ఎన్నికలు.. ప్రభుత్వాలు కూలిపోవడం వంటివి కామన్ అని చెబుతున్నారు. అందుకే జమిలీ ఎన్నికలపై బీజేపీ మరోసారి గెలిస్తే కొత్త ప్రయోగాలు చేసే అవకాశం ఉంది.