బీఆర్ఎస్ ది రైతుల పట్ల మొసలి కన్నీరు
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట:
10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తోందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ విమర్శించారు.
సిద్ధిపేట మార్కెట్ యార్డును సందర్శించిన ఆయన, అక్కడ వరి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి గన్నీ సంచుల కొరతపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ
బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధిపేట మార్కెట్ యార్డులో వరి ధాన్యానికి సరిపడా గన్నీ సంచులు ఉన్నాయని స్పష్టం చేశారు. రైతులు నిరసన తెలిపినప్పుడు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్ఎస్‌కే ఉందని విమర్శించారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.అయితే మక్క రైతులకు గన్నీ బ్యాగుల కొరత ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే ఇంచార్జ్ మంత్రి వివేక్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మక్క రైతులకు సుమారు 15 వేల గన్నీ బ్యాగులు అవసరమని తెలియజేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి, మార్కెట్ ఫెడ్ డీఎంతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.
రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్ర.jpeg)

