మద్దులపల్లి ఐటీడీఏ శిక్షణ కేంద్రంలో డిడి కృష్ణ నాయక్ ని అడ్డుకున్న యువజన కాంగ్రెస్ శ్రేణులు

ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లి శిక్షణ కేంద్రంలో ఐటీడీఏ శిక్షణ కేంద్రంలో 150 మంది గిరిజన యువకులను తక్షణమే ఖాళీ చేయాలని అధికారుల ఆదేశాలకు వ్యతిరేకంగా మద్దులపల్లి ఐటీడీఏ శిక్షణ కేంద్రం వద్ద డిడి కృష్ణ నాయక్ ని యువజన కాంగ్రెస్ శ్రేణులు అడ్డగించారు.ఈ సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకొంటు ప్రభుత్వం విడుదల చేయబోయే నోటిఫికేషన్ కోసం గిరిజన యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తాం అని.ఐటీడీఏ ద్వారా గిరిజన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ కేంద్రాలు కేవలం ప్రచార నిమిత్తం తప్ప ఆ కేంద్రాల్లో కనీసం సిలబస్ పూర్తి కాలేదు, అలాగే సరైన ఫ్యాకల్టీని కూడా నియమించకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు.ఈ సందర్భంలో ఏదో మమా అనిపించి విద్యార్థులను ఈ శిక్షణ కేంద్రం నుండి బయటకు పంపాలని చూడటం చాలా దారుణమైన చర్య అంటూ డి కృష్ణ నాయక్ ని అడ్డుకున్నారు.అక్టోబర్ 16 తేదీ వరకు ఎటువంటి గ్రూప్స్ కు సంబంధించిన ఉద్యోగ నియామక పరిక్షలు లేకపోవడం వల్ల ఈ గిరిజన నిరుద్యోగ యువతకు అక్టోబర్ 16 తేదీ వరకు ఇక్కడే ఉండి శిక్షణ పొందే అవకాశం కల్పించాలని డిడి కృష్ణ నాయక్ ని కోరారు.ఈ సందర్భంగా డిడి తన చేతిలో ఏమీ లేదు అని అక్కడ నుండి వెల్లే ప్రయత్నం చేయగా యువజన కాంగ్రెస్ శ్రేణులు జిల్లా అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ ఆధ్వర్యంలో.డిడి కృష్ణ నాయక్ ని అడ్డుకున్నారు. తదనంతరం పీవో పి.గౌతమ్ తో మాట్లాడిన డిడి రేపటి వరకు సమయం ఇవ్వాలని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా అని హామీ ఇచ్చారు.తదనంతరం ఈ విషయం పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి గిరిజన యువతకు కనీసం గ్రూప్ 1 ఉద్యోగ ఎగ్జామ్ అక్టోబర్ 16 తేదీ వరకు అయినా శిక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ శిక్షణ కేంద్రంతో పాటు.ఐ టీడీ ఏ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని శిక్షణ కేంద్రంలో ఇదే సమస్యతో గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి 8 సంవత్సరాల తరువాత నోటిఫికేషన్ విడుదల చేసి యువతను మభ్య పెట్టే ప్రయత్నం ఆపాలని కోరారు.ఈ సమస్య పరిష్కారం అయ్యే అంతవరకు యువజన కాంగ్రెస్ పోరాడుతుంది అని అన్నారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్ ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బోజ్జెడ్ల రాహుల్, పాలేరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లం మహేష్ యాదవ్, ఖమ్మం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి కొండూరి హృదయ్ కిరణ్, తిరుమలయపాలేం నాయకులు గుగులోత్ సురేష్, నగేష్, ఖమ్మం రూరల్ మండల కో-ఆర్డినేటర్ కోటి రమణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts