రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా..?
- ఎవరూ చేయనటువంటి అభివృద్ధి చేశాడంటున్న కాంగ్రెస్ నాయకులు..
- అనుభవా రాహిత్యంతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నాడంటున్న విపక్షాలు..
- డివైడ్ టాక్ సొంతం చేసుకున్న రేవంత్ పరిపాలన..
- ఒకవైపు దూసుకుపోతూనే అవినీతికి కొమ్ముకాస్తున్నాడంటూ విమర్శలు..
- స్వపక్షంలోనే విపరీతమైన వ్యతిరేకత ఉందంటున్న విశ్లేషకులు..
- ఏది ఏమైనా స్వర్గీయ వై.ఎస్. తరువాత కాంగ్రెస్ ను నిలబెట్టింది రేవంతే..
- అదే అభిప్రాయం అధిష్టానంలో స్థిరస్థాయిగా నిలిచిపోయిందా..?
- సోనియా అల్లుడు రాబర్ట్ వధేరా కోసం రేవంత్ ఓ ప్రాజెక్టు చేస్తున్నాడా..?
- విపక్షాల విమర్శల్లో వాస్తవం ఎంత..? ఇది కేవలం ఊహాగానాలేనా..?
- మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో రేవంత్ దోపిడీకి తెరలేపాడా..?
- నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " అందిస్తున్న స్పెషల్ స్టోరీ..

స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ :
ఇక విపక్షాల విమర్శలు.. నెగటివ్ అంశాలు ఒకసారి చూద్దాం :
ప్రత్యక్షంగా “ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయింది” అన్న విషయం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.. వినిపించడం లేదు.. ఎవరు కూడా ఎలాంటి అభిప్రాయం వెలువడలేదు.. దీనిపై మిశ్రమ అభిప్రాయాలు మాత్రం వెలువడుతున్నాయి.. ఏ తీర్మానమూ సరిగా లేదని, చేసిన వాగ్ధానాలు నెరవేర్చడంలో కాలయాపన చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. “ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ దగా చేస్తున్నదని” అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించడం చూసాం..
ఎన్నికలకు సమీపించే చోట “ప్రచారంలో మధ్యంతర ఆఫర్లు, వాగ్దానాలు హైప్ అవుతుండగా, కానీ అమలు తీరుపై ఆందోళనలు నెలకొంటుండం” లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.. మొత్తానికి చెప్పుకోవాలనిఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మిక్స్‌డ్ రివ్యూ ఉంది.. కొన్ని సంక్షేమ విధానాలు ప్రజల్లో సానుకూల భావనలు కలిగిస్తున్నా, ఇంకా కొన్ని కీలక అంశాల్లో ఆశించిన స్థాయికి చేరలేదని భావించే వర్గాలు ఉన్నాయి. దీనితో రేవంత్ రెడ్డి విజయం వైపు ఇంకా తప్పటడుగులు వేస్తున్నాడని చెప్పవచ్చు..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పరిస్థితి :
నేడు ఎన్నిక జాగుతుండగా లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.. అన్ని పార్టీలు ప్రచార సమయంలో బిజీగా ఎవరి ప్రచారం వారు చేసుకున్నారు.. ఓట్లు శాతం.. ధోరణులపై సర్వేలు కూడా విడుదలయ్యాయి. అయితే కొందరు ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి పాలనకు రెఫరాండం అని వాదిస్తుండగా ఇది కేవలం సాధారణ ఉపఎన్నిక మాత్రమే దీని ఫలితాన్ని రేవంత్ పరిపాలనకు రేవరాండం గా చూడలేము అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు..రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని క్లియర్ చిహ్నాలు ఉన్నాయి – పెద్ద సామాజిక సర్వేలు, సంక్షేమ నిర్ణయాలు మొదలైనవి. కానీ ఇంకా “పూర్తిగా విజయవంతం” అన్న విశ్లేషణ మాత్రం బలంగా వినిపించడం లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది..
రేవంత్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు కూడా కొన్ని వున్నాయి.. యువతలో పాజిటివ్ ఇమేజ్.. ధైర్యంగా మాట్లాడే స్టైల్.. ప్రత్యేకంగా IT/స్టార్టప్ లలో యాక్టివ్ గా ఉండటం.. హైదరాబాద్ పై అటెన్షన్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాఫిక్ రీఫార్మ్స్) ఇవి యువతలో సపోర్ట్ పెంచుతున్న అంశాలు..
అలాగే మధ్యతరగతి, సమీక్షాత్మక దృక్కోణం కూడా ప్లస్ అయ్యింది..
అయితే విద్యుత్, ధరలు, పన్నులపై స్పష్టత లాంటి వ్యవహారాల్లో మిక్సుడు టాక్ వినిపిస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లపై సరైన తీరు కనిపించడం లేదని, వేగం తక్కువగా ఉందని కొంతమంది నిరాశచెందుతున్నారు.. అయితే "ఓపెన్ గవర్నెన్స్", "ట్రాన్స్‌పరెన్సీ" దిశగా అడుగులు వేస్తున్నారనే భావన కూడా ఉంది..
ఇక రైతుల విషయానికొస్తే, ఇక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి..నీటి ప్రాజెక్టులు, సాగునీటి పంపకాలలో క్రమబద్ధత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. రైతు ఆర్థిక పరిస్థితి స్థిరపడడానికి ఇంకా కొన్ని చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు ఉన్నాయి..
ఇక ప్రభుత్వ ఉద్యోగులపై కొన్ని మంచినిర్ణయాలు తీసుకుంటున్నా.. పీ.ఆర్.సి., ఐ.ఆర్.., పెన్షన్ తదితర అంశాలపై ఇంకా క్లారిటీ లేదన్నది నిర్విదాంశం.. ఇకపోతే బిఆర్ఎస్‌కు బలంగా ఉన్న ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.. బీఆర్ఎస్ కేడర్ హై-ఎమోషనల్‌గా ఉన్న ప్రాంతాల్లో ప్రతికూల స్పందన కనిపిస్తోంది..
మొత్తం మీద ప్రజాభిప్రాయం ఏమిటి..?
చురుకైన ముఖ్యమంత్రి గా తిరుగులేని ఇమేజ్.. అవినీతి వ్యతిరేక అటిట్యూడ్.. అడ్మినిస్ట్రేషన్‌పై కంట్రోల్ చూపించే ప్రయత్నం.. హైదరాబాద్ డెవలప్మెంట్‌కు ప్రాధాన్యం.. కొత్త విధానాలు అంటే ఏ 1, స్టార్ట్అప్, ఐటీ విధానాలపై దృష్టి..
ఇక నెగెటివ్ అభిప్రాయాలు :
పథకాల అమలులో వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.. చేసిన వాగ్ధానాలు సంపూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత వుంది.. బీసీ/ఇతర కేటగిరీల క్షేత్రస్థాయి సంక్షేమం అనుకున్నంత స్థాయిలో లేదు.. పోలీసింగ్, రెవెన్యూ వ్యవస్థల్లో మార్పు ఇంకా ప్రారంభ దశలోనే ఉంది..
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఎదురయ్యే ప్రధాన ఛాలెంజ్‌లు ఒకసారి చూసినట్లయితే.. ప్రజలు జాతీయ మీడియా లెవెల్‌లో అటెన్షన్ ఇస్తే, పనులపై కూడా అదే అంచనాలు పెరుగుతాయి. ఇక ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ లో భాగంగా ఋణభారం,
రెవెన్యూ రికవరీ, ఖర్చు క్రమబద్ధత రేవంత్ కు పెను సవాళ్లుగా మారిపోయాయి.. కాగా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు టెన్షన్ క్రియేట్ చేస్తుంటాయి.
“రేవంత్ ప్రభుత్వం సక్సెస్ అవుతుందా?” అంటే సక్సెస్సు దిశగా అడుగులు వేస్తోంది.. కానీ పూర్తి విజయాన్ని అందుకునే సమయం ఇంకా రాలేదని చెప్పవచ్చు.. అయితే 100 రోజులు, 6 నెలలు, 1 సంవత్సరం అనే మైలు రాళ్లపై ఆధారపడి ప్రజలు అభిప్రాయం మార్చుకుంటారు.
ప్రస్తుతం ప్రజా భావన ఎలా ఉంది..? :
కొంత ఇంప్రెషన్ ఉంది, కానీ రిజల్ట్స్ సరిగా కనిపించడం లేదు.. యూజ్ జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రభుత్వానికి మూడ్ ఇండికేటరా? అంటే అవుననే చెప్పవచ్చు.. ఎలా అంటే.. ఇది ఒక అర్బన్, హై ప్రొఫైల్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం.. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి అర్బన్ సపోర్ట్ ఇండికేషన్ లభిస్తుంది.. ప్రభుత్వానికి వున్నా పాపులారిటీ ఏమిటో అర్థమవుతుంది కానీ పూర్తిగా రెఫరెండం కాదు. ఏదేమైనా రేవంత్ ఖాతాలో జూబ్లీహిల్స్ విజయం చేరుతుందా లేదా అన్నది మరో మూడు రోజుల్లో తేలిపోతుంది.. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పరిపాలనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతుండటం గమనార్హం..
