ప్రజా వాణి లో నమోదైన అర్జీలను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలి
మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్ జిల్లా:
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టరు విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులను డిఆర్ఓ (ఇంఛార్జి) చంద్రావతి లతో కలిసి అదనపు కలెక్టరు (153) దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టరు మాట్లాడుతూ ఈరోజు హౌజింగ్ డిపార్టుమెంట్ కు అధిక సంఖ్యలో (53) దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూడాలని అదనపు కలెక్టరు అన్నారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టరు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
03 Mar 2026
